Sudheer Babu : మహేష్ సినిమాపై కన్నేసిన సుధీర్‌బాబు.. సాధ్యమయ్యే పనేనా అది.?

NQ Staff - September 13, 2022 / 10:40 PM IST

Sudheer Babu : మహేష్ సినిమాపై కన్నేసిన సుధీర్‌బాబు.. సాధ్యమయ్యే పనేనా అది.?

Sudheer Babu : వెర్సటైల్ హీరోగా పేరు తెచ్చుకున్న సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం ‘ఆ అమ్మాయి గురించి మీకు చెబుతా’ త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్లు వేగవంతం చేసింది.

Sudheer Babu is eyeing Mahesh movie

Sudheer Babu is eyeing Mahesh movie

ఈ సందర్భంగా ప్రమోషన్లలో పాల్గొంటున్న సుధీర్ బాబుని పలు రకాల ప్రశ్నలు వేసి, ఆసక్తికరమైన సమాధానాలు రాబడుతున్నారు మీడియా మిత్రులు. ఈ క్రమంలో మహేష్ బాబు గురించి అడిగిన ఓ విచిత్రమైన ప్రశ్నకు సుధీర్ బాబు నుంచి వచ్చిన సమాధానం కూడా అంతే విచిత్రంగా వుండడం మరో విచిత్రం.

అంత జోరుగా వున్నాడు సుధీర్ బాబు.!

మహేష్ బాబు నటించిన ‘1 – నేనొక్కడినే’ చిత్రం గురించి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మహేష్ కెరీర్‌లో డిజాస్టర్‌గా చెప్పుకోవచ్చు. అయితే, ఈ సినిమా డిజాస్టర్ అవ్వడం సుధీర్ బాబుకు నచ్చలేదట.

ఇంటెలిజెంట్ స్ర్కీన్‌ప్లేతో సాగిన ఈ సినిమా అంటే తనకు ఎంతో ఇష్టమనీ, ప్రేక్షకులు ఈ సినిమాని అంతగా ఆదరించకపోవడం ఒకింత బాధాకరమనీ సుధీర్ బాబు చెప్పాడు. అసలెందుకు సుధీర్ బాబు ఈ సినిమా గురించి రెస్పాండ్ అవ్వాల్సి వచ్చిందంటే, మహేష్ పాత సినిమాల్లో ఏ సినిమాల్లో మళ్లీ నటిస్తే బావుంటుంది.? అని అడిగిన ప్రశ్నకు సుధీర్ బాబు నుంచి వచ్చిన రెస్పాన్సే ఇది.

మహేష్ బాబు ‘1 – నేనొక్కడినే’ సినిమాని మళ్లీ చేస్తే బావుంటుందేమో అన్నాడు సుధీర్ బాబు. కానీ, అది సాధ్యపడే విషయమేనా.? ఒకవేళ మహేష్ చేయకపోతే, ఆ సినిమాని సుధీర్ బాబు మళ్లీ చేసేస్తాడేమో.! అన్నట్లు మహేష్ తనయుడు గౌతమ్ ఈ సినిమాలో నటించాడు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us