Sudheer Babu : ‘హంట్’ ఫస్ట్ లుక్.! హీరో సుధీర్ బాబు ‘వేట’ మొదలైంది.!

NQ Staff - August 28, 2022 / 09:06 PM IST

155575Sudheer Babu : ‘హంట్’ ఫస్ట్ లుక్.! హీరో సుధీర్ బాబు ‘వేట’ మొదలైంది.!

Sudheer Babu : హీరో అనడం కంటే, విలక్షణ నటుడు అనడం కరెక్టేమో టాలీవుడ్ నటుడు సుధీర్‌బాబు గురించి. టాలీవుడ్ నటుడే కాదు, బాలీవుడ్‌లోనూ ఓ సినిమా చేశాడు సుధీర్‌బాబు. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడైనప్పటికీ, సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు సుధీర్.

Sudheer Babu Hunt movie first look

Sudheer Babu Hunt movie first look

సక్సెస్, ఫెయిల్యూర్ అనే ఈక్వేషన్స్‌తో సంబంధం లేకుండా విలక్షణమైన సినిమాలతో దూసుకెళుతున్న సుధీర్‌బాబు నుంచి మరో విలక్షణమైన సినిమా రాబోతోంది. ఆ సినిమా పేరు ‘హంట్’. తుపాకులు అబద్ధాలు చెప్పవు.. (గన్స్ డోన్ట్ లై) అనేది ఈ సినిమా క్యాప్షన్.

టైటిల్ పోస్టర్ అదుర్స్..

సుధీర్‌బాబు కొత్త సినిమా ‘హంట్’ టైటిల్ లుక్ రివీల్ చేసింది చిత్ర బృందం. ఈఫిల్ టవర్, గన్.. ఇలా చాలా కనిపిస్తున్నాయి టైటిల్ పోస్టర్‌లో అగ్రెసివ్ లుక్‌తో సుధీర్‌బాబు కనిపిస్తున్నాడు. బ్యాక్ అండ్ వైట్.. దానికి గోల్డ్ థీమ.. వెరసి, చాలా ఇంట్రెస్టింగ్‌గా రూపొందించారు ‘హంటర్’ టైటిల్ లుక్‌ని.

ఈ సినిమాలో తమిళనటుడు భరత్ కూడా నటిస్తుండడం గమనార్హం. మహేష్ ఈ చిత్రానికి దర్శకుడు. భవ్య క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది. పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.