SSMB28 : జెట్ స్పీడ్.! SSMB28 ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసిన మహేష్, త్రివిక్రమ్ కాంబో.!

NQ Staff - September 21, 2022 / 03:48 PM IST

159896SSMB28 : జెట్ స్పీడ్.! SSMB28 ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసిన మహేష్, త్రివిక్రమ్ కాంబో.!

SSMB28 : సూపర్ స్టార్ మహేష్‌బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘ఎస్ఎస్ఎంబీ28’ సినిమా అప్పుడే తొలి షెడ్యూల్ పూర్తి చేసేసుకుంది. ఇటీవలే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళగా, ఇంతలోనే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

హై ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్ ఈ ఫస్ట్ షెడ్యూల్‌లో పూర్తి చేశారట. స్టంట్ కొరియోగ్రాఫర్స్ ‘అన్బారివు’ ఈ యాక్షన్ ఎపిసోడ్‌ని డిజైన్ చేశారు.

రెండో షెడ్యూల్‌లో జాయిన్ అవనున్న పూజా హెగ్దే..

SSMB28 Completion Of First Schedule Surprising Everyone

SSMB28 Completion Of First Schedule Surprising Everyone

త్వరలో రెండో షెడ్యూల్ పూర్తి కానుంది. విజయదశమి తర్వాత ఈ షెడ్యూల్‌ని ప్రారంభించనుండగా, ఈ షెడ్యూల్‌లో హీరోయిన్ పూజా హెగ్దే జాయిన్ అవబోతోంది.

మామూలుగా అయితే ఇటు మహేష్ అయినా, అటు త్రివిక్రమ్ అయినా నెమ్మదిగా సినిమా పూర్తి చేస్తారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన సినిమాలూ అలాగే ఆలస్యమయ్యాయి. కానీ, ఈసారి అందుకు భిన్నంగా జెట్ స్పీడ్‌తో సినిమా పూర్తి చేయడానికి సిద్ధమైనట్లున్నారు.
అభిమానులకు అంతకన్నా కావాల్సిందేముంది.? కోవిడ్ సహా అనేక కారణాలతో మొత్తంగా సినీ పరిశ్రమలో కొంత నిస్తేజం అలముకోగా.. మళ్ళీ ఇప్పుడిప్పుడే కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.