SS Rajamouli : రాజమౌళి-పవన్ కల్యాణ్ కాంబోలో మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా ఇదే..!
NQ Staff - January 28, 2023 / 09:45 AM IST

SS Rajamouli : రాజమౌళి, పవన్ కల్యాణ్.. ఇద్దరూ ఇద్దరే. జక్కన్న దర్శకత్వంలో టాప్ అయితే.. పవన్ కల్యాణ్ హీరోల్లో టాప్. రాజమౌళి ఒక సినిమా తీస్తే ఇండియన్ ఇండస్ట్రీ మొత్తం ఆ సినిమా వైపు చూస్తుంది. ఆయన తీసే సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో ఇప్పటికే బాహుబలి, త్రిబుల్ ఆర్ సినిమాలు నిరూపించాయి. ఈ సినిమాలతో పాన్ ఇండియా నెంబర్ వన్ డైరెక్టర్ అయిపోయాడు రాజమౌళి.
అంతకు ముందు తీసిన సినిమాలు కూడా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమాలే. ఇండియన్ హిస్టరీలో రాజమౌళి పేరు చిరస్థాయిలో నిలిచిపోతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే పవన్ కల్యాణ్ కూడా హీరోల్లో నెంబర్ వన్ పొజీషన్ లో కొనసాగుతున్నాడు. అందరి కంటే ఆయనకే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
పవన్ ను అడిగితే..

SS Rajamouli Wanted Make Vikramarkudu Movie With Pawan Kalyan
మరి అంత పెద్ద స్టార్ హీరోతో రాజమౌళి సినిమా ఎందుకు చేయలేదని మెగా ఫ్యాన్స్ ఇప్పటికీ బాధ పడుతున్నారు. కానీ రాజమౌళి గతంలోనే పవన్‌తో సినిమా చేద్దామని అడిగాడు. ఆ సినిమా ఏదో కాదు విక్రమార్కుడు. రవితేజ కంటే ముందు ఈ సినిమాను పవన్ తో తీయాలని రాజమౌళి భావించాడు.
కానీ అప్పటికే ఒప్పుకున్న సినిమాలతో పవన్ చాలా బిజీగా ఉన్నానని ఇప్పుడు కుదరదు అంటూ చెప్పాడు. దాంతో రాజమౌళి రవితేజను పెట్టి విక్రమార్కుడు సినిమా తీశాడు. అది ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
రవితేజను స్టార్ హీరోను చేసి పడేసింది. ఒకవేళ ఆ సినిమా గనక పవన్ తో తీసి ఉంటే వేరే లెవల్ లో ఉండేదేమో. కానీ ఇప్పుడు పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు కాబట్టి రాజమౌళి సినిమా కోసం రెండు, మూడేండ్లు కేటాయించేంత టైమ్ లేదు. కాబట్టి వీరిద్దరి కాంబోలో భవిష్యత్ లో ఇక సినిమా రాదు అనే చెప్పాలి.