SS Rajamouli : ‘ఆర్ఆర్ఆర్’: న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డు అందుకున్న రాజమౌళి.!
NQ Staff - January 5, 2023 / 12:41 PM IST

SS Rajamouli : ప్రముఖ సినీ దర్శకుడు, టాలీవుడ్ ‘జక్కన్న’ రాజమౌళికి ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. అదీ, స్వదేశంలో కాదు.. విదేశాల్లో. న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ పురస్కరానాన్ని రాజమౌళి అందుకున్నారు.

SS Rajamouli Received New York Film Critics Circle Award For Best Director
‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికిగాను, ఈ ఏడాది ఉత్తమ దర్శకుడిగా న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ ఈ అవార్డును ఆయనకు అందించింది.
సంప్రదాయ దుస్తుల్లో రాజమౌళి, రమ..

SS Rajamouli Received New York Film Critics Circle Award For Best Director
ఈ పురస్కారాన్ని అందుకునే క్రమంలో దర్శకుడు రాజమౌళి సంప్రదాయ దుస్తుల్లో సందడి చేయడం గమనార్హం. వేదికపై ఆయన ప్రసంగించారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కడం ఆనందంగా వుందన్నారు.

SS Rajamouli Received New York Film Critics Circle Award For Best Director
విమర్శకుల ప్రశంసల్ని ఏ దర్శకుడైనా కోరుకుంటాడనీ, ఆ ఘనత.. అంతర్జాతీయంగా తనకు దక్కుతోందని రాజమౌళి చెప్పుకొచ్చారు. రాజమౌళి వెంట ఆయన సీమణి రమ కూడా వున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి కాస్ట్యూమ్స్ రమ చూసుకున్న సంగతి తెలిసిందే.
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీయార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ ఆస్కార్ రేసులో సత్తా చాటాలని భారతీయ సినీ అభిమానులు కోరుకుంటున్నారు.
Congratulations @ssrajamouli sir for receiving New York Film Critics Circle (#NYFCC) Best Director Award 👏 All the very best for ur upcoming projects 💥✨🎉🎊#RRR #SSRajamouli #RamaRajamouli #JrNTR #RamCharan #RRRMovie #MMKeeravaani #Tollywood pic.twitter.com/hdcF7GmnDq
— Studio Green (@StudioGreen2) January 5, 2023