SS Rajamouli : రాజమౌళి హీరోగా చెయ్యాల్సిన సినిమా ఎలా మిస్ అయ్యిందంటే.. అదే చేసి ఉంటే..
NQ Staff - March 7, 2023 / 05:12 PM IST

SS Rajamouli : దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈయన ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా పేరు సంపాదించు కున్నాడు. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఈయన మన తెలుగు సినిమా ఖ్యాతిని ఆస్కార్ వరకు తీసుకు వెళ్ళాడు.. రాజమౌళి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్, రాజనందిని దంపతులకు జన్మించారు..
పశ్చిమ గోదావరి జిల్లా అయినప్పటికీ ఈయన పుట్టింది మాత్రం కర్ణాటక.. విద్యాబ్యాసం మొత్తం కొవ్వూరు, ఏలూరు, వైజాగ్ లో జరిగింది.. చదువు పూర్తి అయిన తర్వాత జక్కన్న సినిమాలపై ఉన్న మక్కువతో డైరెక్టర్ గా మారి ముందుగా సీరియల్స్ కు దర్శకత్వం వహించాడు.. ఆ తర్వాత 2001లో స్టూడెంట్ నెం 1 సినిమాతో వెండితెరకు డైరెక్టర్ గా పరిచయం అయ్యి మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు.
22 ఏళ్ల కెరీర్ లో రాజమౌళి కేవలం 12 సినిమాలు మాత్రమే తీసినా అవన్నీ కూడా ఒకదానిని మించి ఒకటి హిట్ సాధించాయి. ఇక చివరిగా చేసిన ట్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ గా డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. మరి ఇది ఆస్కార్ బరిలో ఉండగా ఈ సినిమా ఆస్కార్ తెస్తుందో లేదో అని అంతా ఎదురు చూస్తున్నారు.. మరి దర్శకుడిగా సంచలనం సృష్టిస్తున్న రాజమౌళి హీరోగా చేసి ఉంటే.. తెలుగు పరిశ్రమకు ఇంత కీర్తి దక్కేది కాదు అనే చెప్పాలి.
అయితే రాజమౌళిని హీరోగా చేసేందుకు ప్రయత్నాలు చేశారట.. కీరవాణి తండ్రి, రాజమౌళి పెద్దనాన్న ఈయన హీరోగా అయ్యే ఛాన్స్ ఉందని బలంగా నమ్మగా.. తండ్రి విజయేంద్ర ప్రసాద్ కూడా ఒక కథ రాసి, బి గోపాల్ దర్శకత్వంలో హీరోగా చేయించాలని అనుకుంటే రాజమౌళి అందుకు నో చెప్పారట.. తాను హీరో అవ్వను అని డైరెక్షన్ మీద ఇంట్రెస్ట్ ఉందని చెప్పడంతో తండ్రి, పెదనాన్న హీరో చెయ్యాలనే ప్రయత్నాలను ఆపేశారట.. అలా జక్కన్న హీరోగా అవ్వలేదు..