SS Rajamouli : ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ చూసిన అవతార్‌ డైరెక్టర్‌.. రాజమౌళి, కీరవాణిపై ప్రశంసలు..!

NQ Staff - January 16, 2023 / 11:14 AM IST

SS Rajamouli  : ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ చూసిన అవతార్‌ డైరెక్టర్‌.. రాజమౌళి, కీరవాణిపై ప్రశంసలు..!

SS Rajamouli : త్రిబుల్‌ ఆర్‌ మూవీ వచ్చి ఏడాది కావస్తోన్నా దాని మేనియా ఇంకా తగ్గట్లేదు. ఏదో ఒక రూపంలో త్రిబుల్‌ ఆర్‌ మూవీ గురించి న్యూస్‌ వస్తూనే ఉంది. ఇప్పటికే ఎన్నో అవార్డులు, రివార్డులు దక్కించుకుంటోంది. మరి జక్కన్న చెక్కిన మూవీ అంటే ఆ మాత్రం ఉండాలి కదా. ఆయన ఇప్పటి వరకు తీసిన సినిమాల్లో త్రిబుల్‌ ఆర్‌ మూవీకే ఎక్కువ అవార్డులు వస్తున్నాయి.

కీరవాణి అందించిన నాటు నాటు సాంగ్‌కు రీసెంట్ గానే గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు కూడా లభించింది. కాగా అవార్డుల జాతర ఇంకా ఆగట్లేదు. తాజాగా త్రిబుల్‌ ఆర్‌ మూవీకి మరో రెండు అవార్డులు కూడా సొంతం అయిపోయాయి. తాజాగా క్రిటిక్స్‌ చాయిస్ అవార్డు వేడుక జరిగింది. ఇందులో జక్కన్న టీమ్‌ పాల్గొంది.

అవార్డు ఫంక్షన్‌ లో..

SS Rajamouli And Keeravani Meet Director James Cameron

SS Rajamouli And Keeravani Meet Director James Cameron

ఈ అవార్డుల ఫంక్షన్‌ లో త్రిబుల్‌ ఆర్‌ మూవీకి రెండు అవార్డులు దక్కాయి. అందులో ఒకటి బెస్ట్‌ సాంగ్‌ కింద నాటునాటుకు దక్కగా, ఇంకొకటి బెస్ట్‌ ఫారిన్‌ లాంగ్వేజ్‌ ఫిల్మ్‌ అవార్డు వచ్చింది. ఈ అవార్డు ఫంక్షన్‌ లో అవతార్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరూన్‌ను రాజమౌళి, కీరవాణి కలిశారు. ఈ సందర్భంగా తాను త్రిబుల్‌ ఆర్‌ సినిమా చూసినట్టు చెప్పాడు జేమ్స్‌.

SS Rajamouli And Keeravani Meet Director James Cameron

SS Rajamouli And Keeravani Meet Director James Cameron

తాను చూడటమే కాకుండా తన భార్య సూజీనిక కూడా చూడమని చెప్పి, ఆమె చూసే సమయంలో ఆయన మరోసారి చూశాడు. అంతే కాకుండా పది నిముషాల పాటు త్రిబుల్‌ ఆర్‌ గురించే జక్కన్నతో మాట్లాడాడు. రాజమౌళిని ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌ డైరెక్టర్‌ అంటూ కామెరూన్‌ మెచ్చుకున్నాడు. ఈ విషయాలను రాజమౌళి ట్విట్టర్‌ వేదికగా పంచుకున్నాడు.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us