SS Rajamouli : సర్‌ ప్రైజ్.. హీరోగా ఎంట్రీ ఇస్తున్న రాజమౌళి.. ఏ సినిమాలో అంటే..!

NQ Staff - January 22, 2023 / 11:10 AM IST

SS Rajamouli : సర్‌ ప్రైజ్.. హీరోగా ఎంట్రీ ఇస్తున్న రాజమౌళి.. ఏ సినిమాలో అంటే..!

SS Rajamouli : రాజమౌళి.. ఈ పేరుకు ఉన్న ఫాలోయింగ్‌ మైండ్‌ బ్లోయింగ్‌. సాధారణంగా సినిమా హీరోలకు మాత్రమే ఫ్యాన్స్‌ ఉంటారు. కానీ హీరోలతో సమానంగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఏకైక దర్శకుడు అంటే రాజమౌళి అనే చెప్పుకోవాలి. మిగతా దర్శకులు తీసే సినిమాలకు అందులో ఉన్న హీరోలను బట్టి మార్కెట్‌ ఏర్పడుతుంది. కానీ రాజమౌళి సినిమాలకు మాత్రం హీరోలు ఎవరు అనేది ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే అక్కడ సినిమాను తీస్తుంది రాజమౌళి.

ఆ ఒక్కటి చాలు ప్రేక్షకులకు. అయితే ఇప్పటి వరకు తన సినిమాలతో ప్రపంచ స్థాయిలో పేరు తెచ్చుకున్న రాజమౌళి.. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ ఇది నిజమేనండి బాబు. అదేంటి రాజమౌళి హీరోగా ఎంట్రీ ఇస్తే ఏమవుతుంది. సినిమా రంగంపై ఆయనుకు ఉన్నంత పట్టు ఇంకెవరికి ఉంది అనుకుంటున్నారు కదా.

తీస్తున్నది వారే..

అవును.. మీరు అనుకుంటున్నది నిజమే. అందుకే ఇప్పుడు ఆయన లీడ్‌ రోల్‌ లో ఓ డాక్యుమెంటరీ రూపొందుతోంది. రాజమౌళినే ఇందులో మెయిన్‌ రోల్‌ చేస్తున్నాడు. బాలీవుడ్ కి చెందిన అప్లాజ్ ఎంటర్టైన్మెంట్స్, ఫిల్మ్ కంపానియన్ సంస్థలు కలిసి ‘మోడ్రన్ మాస్టర్స్’ అనే డాక్యూమెంటరీ సిరీస్ ని తీశారు.

వీరు ఇండియాలో బాగా పాపులర్‌ అయిన ప్రముఖ టెక్నీషియన్స్ లైఫ్ స్టైల్, వర్కింగ్ స్టైల్, డైలీ హ్యాబిట్స్, ట్రావెల్స్, కెరీర్ లాంటి వాటితో ఒక్కొక్కరిపై ఒక్కొక్క డాక్యుమెంటరీ తీస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి ఎపిసోడ్‌ ను రాజమౌళిపై తీశారు. దీనికి మోడ్రన్‌ మాస్టర్‌ అనే పేరు పెట్టారు. ఇందులో కొన్ని విజువల్స్‌ కోసం రాజమౌళి స్వయంగా నటించాడు. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్‌ కుషీ అవుతున్నారు. రాజమౌళి పూర్తి ఎపిసోడ్‌ కోంస వెయిట్‌ చేస్తున్నారు.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us