Srihan : శ్రీహాన్ ఇది మరీ టూమచ్.! నిజంగానే సిరికి భయపడుతున్నావా.?
NQ Staff - September 8, 2022 / 04:10 PM IST

Srihan : బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్‌లో శ్రీహాన్ ఓ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. గత సీజన్‌లో కీలకమైన కంటెస్టెంట్ అయిన సిరి హన్మంత్‌కి ఈ శ్రీహాన్ బాయ్ ఫ్రెండ్ అని దాదాపు అందరికీ తెలిసిందే.
అయితే, హౌస్‌లో పరిస్థితులు ఎలా వుంటాయో తెలిసిందే కదా. ఎవరు, ఎవరికి, ఎప్పుడు, ఎలా, ఎంతలా క్లోజ్ అవుతారో ఎవరికీ తెలీదు. ఆ క్లోజ్‌నెస్ కారణంగా ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందో కూడా ముందుగా అయితే గెస్ చేయలేం కానీ, గత సీజన్ల అనుభవాలు అయితే గుర్తు చేసుకోగలం.
అదేనండీ, ఫ్రెండ్స్ అంటూ హౌష్‌లోకి వెళ్లిన సిరి హన్మంత్, షణ్ముఖ్.. ఆ తర్వాత ఎలా బిహేవ్ చేశారో తెలిసిందే కదా. హౌస్‌లో వీళ్ల ఛండాలమైన బిహేవియర్‌కి వీక్షకులూ చిరాకు పడ్డారు. అంతులేని అసహనం వ్యక్తం చేశారు. అలాగే, ప్రేమించిన అమ్మాయి దీప్తి సునయనను కూడా దూరం చేసుకున్నాడు షణ్ణూ. సరే, ఆ సంగతి పక్కన పెట్టేద్దాం.

Srihan and Keerthi Keshav Bhat Love Started Bigg Boss House
అందుకే శ్రీ హాన్ క్లారిటీ ఇచ్చాడా.?
ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజా ఎపిసోడ్ కంటెస్టెంట్ అయిన శ్రీహాన్ ముందు నుంచే జాగ్రత్త పడుతున్నాడట. శ్రీహాన్‌కీ, మరో కంటెస్టెంట్ అయిన కీర్తి భట్‌కీ మధ్య ఏదో జరుగుతోందనీ, షో చూస్తున్న సిరి, తన గురించి ఏమనుకుంటుందో అని శ్రీహాన్ భయపడుతున్నాడనీ బయట ప్రచారం మొదలైపోయింది.
హౌస్‌లోనూ అదే గుసగుస నడుస్తోంది. ఆ సంగతి ముందే కనిపెట్టేసిన శ్రీ హాన్ తన వంతుగా క్లారిటీ ఇచ్చేశాడు. కీర్తి భట్‌కీ తనకు మధ్య ఎలాంటి కెమిస్ర్టీ లేదనీ, తనను అవాయిడ్ చేస్తున్నానంటూ కీర్తి భట్ తప్పుగా అర్ధం చేసుకుంటోందనీ, తోటి కంటెస్టెంట్లతో పాటే, తను కూడా తనకి ఓ ఫ్రెండ్‌లాంటిదేననీ శ్రీ హాన్ చెప్పాడు. అయినా కానీ, పుట్టే పుకార్లు పుడుతూనే వుంటాయ్. జరిగే ప్రచారాలు జరుగుతూనే వుంటాయ్. పొగయితే వచ్చేసింది.. నిప్పు కూడా పుడుతుందేమో చూడాలి మరి.