Sridevi : అమ్మకానికి అతిలోక సుందరి చీరలు.. పిల్లల కోసం మంచి మనసు

NQ Staff - October 6, 2022 / 09:14 AM IST

Sridevi : అమ్మకానికి అతిలోక సుందరి చీరలు.. పిల్లల కోసం మంచి మనసు

Sridevi : అతిలోక సుందరి శ్రీదేవి చనిపోయి సంవత్సరాలు గడుస్తున్నా ఆమె అంటే క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆమె ఒక స్టార్ హీరోయిన్గా దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఆమె చివరిగా 2012వ సంవత్సరంలో ఇంగ్లీష్ వింగ్లీష్ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత శ్రీదేవికి ఎన్నో ఆఫర్స్ వచ్చాయి కానీ పెద్దగా ఆసక్తి చూపించలేదు.

తాజాగా సినిమా పది సంవత్సరాల పూర్తి చేసుకున్న తరం నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు ఒక మంచి పనికి శ్రీకారం చుట్టారు. బాలికల విద్య కోసం చిత్ర యూనిట్ సభ్యులు విరాళం ఇవ్వాలనుకున్నారు.

అందుకోసం ఆ సినిమాలో శ్రీదేవి ధరించిన చీరలను వేలం పాట ద్వారా అమ్మి వచ్చిన మొత్తంను బాలికల యొక్క విద్య కోసం ఖర్చు చేయాలని నిర్ణయించారు. ఈ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులను ప్రశంసించకుండా ఉండలేమంటూ బాలీవుడ్ మీడియా అభిప్రాయం వ్యక్తం చేస్తుంది.

దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న శ్రీదేవి కట్టుకున్న చీరలను కొనుగోలు చేసేందుకు వందలాది మంది ఆమె అభిమానులు ముందుకు వచ్చే అవకాశం ఉంది. తద్వారా లక్షల్లో డబ్బులు చేకూరి బాలికల విద్య కోసం అందే అవకాశం ఉంది. ఈ విషయంలో చిత్ర నిర్మాతలను అభినందించాల్సిందే.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us