Sridevi Drama Company : ఇమ్మాన్యుయేల్‌పై ఫుల్ ఫైర్ అయిన పూర్ణ… స్పృహ తప్పి పడిపోయిన రష్మీ
NQ Staff - May 31, 2022 / 01:12 PM IST

Sridevi Drama Company : బుల్లితెరపై నాన్ స్టాప్ వినోదం పంచుతూ ప్రేక్షకులని రక్తి కట్టిస్తున్న షో శ్రీదేవి డ్రామా కంపెనీ.గత కొద్ది రోజులుగా సక్సెస్ ఫుల్ గా సాగుతున్న ఈ షోకి సుధీర్ హోస్ట్‌గా ఉండగా, ఇంద్రజ జడ్జిగా ఉన్నారు. గత రెండు ఎపిసోడ్స్‌లో ఇంద్రజ కనిపించలేదు. ఆమె స్థానంలో ఆమని, పూర్ణ వచ్చారు. వారు షోని రక్తి కట్టించే ప్రయత్నం చేశారు.
వచ్చే వారంకి సంబంధించి తాజాగా ప్రోమో విడుదల కాగా, ఇందులో సుడిగాలి సుధీర్ కనిపించలేదు. అయితే కొన్ని కొత్త అందాలు జాయిన్ అయ్యాయి. వారిలో పూర్ణ ఒకరు. మొదటిసారి పూర్ణ శ్రీదేవి డ్రామా కంపెనీలో మెరిశారు. హైపర్ ఆది హగ్గు అడుగగా.. ఆ హగ్గులు ఇవ్వలేక ఢీ మానేశాను, మళ్ళీ ఇక్కడ కూడానా అంటూ సెటైర్ వేశారు. రష్మీ డాన్స్ షోకి హైలెట్ గా నిలిచింది.
ఆమె తెలుగును ఉద్దేశిస్తూ హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ జోకులు వేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీ యాంకర్ గా ఆమె చేస్తున్న ప్రమాణస్వీకారంలో తెలుగు తప్పులు, పలకలేక తిప్పలు నవ్వు తెప్పించాయి. లేటెస్ట్ ఎపిసోడ్ కోసం జబర్దస్త్ లో లేడీ గెటప్స్ వేసిన మగాళ్లను ప్రత్యేకంగా పిలిచారు. లేడీ గెటప్స్ అవకాశాలు ఈ మధ్య రావడం లేదని, బుల్లితెరపై కనిపించకపోవడంతో బయట ఈవెంట్స్ కి ఎవరూ పిలవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే లేడీ గెటప్స్ వేసేవాళ్లను సమాజంలో చులకనగా చూస్తున్నారంటూ బాధపడ్డారు.

Sridevi Drama Company Promo
ఇదిలా ఉండగా షో చివర్లో ఓ సీరియస్ పరిణామం చోటు చేసుకుంది. పూర్ణ వేదికపై మాట్లాడుతుండగా పక్కనే ఉన్న ఇమ్మాన్యుయేల్ ఆమెను తాకాడు. దీంతో పూర్ణ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు. నన్ను అలా తాకడానికి నువ్వు ఎవరు? నీకెంత ధైర్యం అంటూ మండిపడ్డారు.
పూర్ణ అలా రియాక్ట్ కావడంతో అందరూ షాక్ అయ్యారు. గొడవ జరుగుతున్నఈ ప్పుడు వేదిక మీదే ఉన్న రష్మీ ఒక్కసారిగా కూలిపోయారు. పక్కనే ఉన్న రామ్ ప్రసాద్ ఆమెను క్రింద పడిపోకుండా పట్టుకున్నాడు. రష్మీ సొమ్మసిల్లి పడిపోవడానికి కారణం ఏమిటో అర్థం కాలేదు. పూర్ణ-ఇమ్మానియేల్ గొడవ కారణంగా ఆమె అప్సెట్ అయ్యారా? అనే అనుమానం కలుగుతుంది. వీటన్నింటికి క్లారిటీ రావాలంటే వచ్చే ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే.