Alluri Movie : ‘అల్లూరి’ సినిమా కష్టాలు తీరాయ్.! కానీ, ఆ కష్టాలెందుకొచ్చాయ్.?

NQ Staff - September 23, 2022 / 06:28 PM IST

160326Alluri Movie : ‘అల్లూరి’ సినిమా కష్టాలు తీరాయ్.! కానీ, ఆ కష్టాలెందుకొచ్చాయ్.?

Alluri Movie : శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన ‘అల్లూరి’ సినిమాకి స్టైలిష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆశీస్సులు లభించిన సంగతి తెలిసిందే. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రావడంతో, సినిమాపై హైప్ పెరిగింది.

Sri Vishnu Alluri Movie release late issue

Sri Vishnu Alluri Movie release late issue

భారీ అంచనాల నడుమ.. అనలేంగానీ, శ్రీవిష్ణు సినిమాల్లోనే అత్యంత భారీ స్థాయిలో ఈ సినిమా విడదులవుతోందని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఈ సినిమాలో శ్రీ విష్ణు పోలీస్ అధికారిగా కనిపించబోతున్నాడు.

సినిమా కష్టాలెందుకొచ్చాయ్.?

సినిమా రిలీజ్ అంటే, ప్రసవ వేదన అంటారు ప్రముఖ నిర్మాతలు. పెద్ద పెద్ద నిర్మాతలకే సినిమా రిలీజ్ అనేది ఓ గండంగా మారిపోతుంటుంది. ‘అల్లూరి’ సినిమాకి కూడా అలాంటి గండాలే ఎదురయ్యాయి. దాంతో, ఈ రోజు మార్నింగ్ షోలు పడలేదు.

ఎలాగైతేనేం, వివాదాల్ని పరిష్కరించుకోగలిగింది ‘అల్లూరి’ టీమ్. ‘మధ్యాహ్నం నుంచి సినిమా మీదే..’ అంటూ శ్రీ విష్ణు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అయితే, ఆ కష్టాలు ఏంటన్నదానిపై మాత్రం స్పష్టత రావాల్సి వుంది.

ఎలాగైతేనేం, కాస్త ఆలస్యంగానే అయినా సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. దాంతో, శ్రీ విష్ణు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రానికి ప్రదీప్ వర్మ దర్శకుడు. బెక్కం వేణుగోపాల్ నిర్మాత. అస్సాం బ్యూటీ కాయదు లోహర్ ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన హీరోయిన్‌గా నటించింది.