Sri Satya : శ్రీ సత్య గిచ్చుడు.! కీర్తికి ఒళ్ళు మండిపోయింది.!
NQ Staff - November 16, 2022 / 08:27 AM IST

Sri Satya : బిగ్ బాస్ రియాల్టీ షో ఆరో సీజన్ తాజా ఎపిసోడ్‌లో రెండు కొప్పుల మధ్య పంచాయితీ నడిచింది. అదేనండీ, ఈ సీజన్ బ్యూటిఫుల్ లేడీ శ్రీ సత్య, ఇంకో ఇంట్రెస్టింగ్ ఫిమేల్ కంటెస్టెంట్ కీర్తి మధ్య రచ్చ చోటు చేసుకుంది.
‘నువ్వు నా గురించి వెటకారం చేయడం నాకు నచ్చలేదు.. నాకు తెలిసిన శ్రీ సత్య ఇప్పుడు కనిపించడంలేదు..’ అంటూ కీర్తి వాపోయింది. ఒకింత కంటతడి పెట్టేదాకా వెళ్ళిపోయింది కీర్తి. అయితే, ‘కీర్తి మారిపోయింది. ఒకప్పటి కీర్తి వేరు..’ అంటూ శ్రీ సత్య మండిపడింది.. ఒకింత వెటకారం చేసింది కూడా.
ఎవరి గేమ్ ప్లాన్ ఏంటి.?
‘నా ఆట నా ఇష్టం. నేనెవర్నీ కించపర్చలేదు. నీకు నచ్చినట్లు వుండాలంటే ఎలా.?’ అని శ్రీ సత్య అంటే, నువ్వు ఎలాగైనా వుండు, నన్ను కించపర్చొద్దు.. అంటూ కీర్తి, శ్రీ సత్యని నిలదీసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా వాగ్యుద్ధం చోటు చేసుకుంది.
నిజానికి, శ్రీసత్య – కీర్తి మధ్య మంచి స్నేహమే వుంది. కానీ, ఈ తగాదాతో ఇద్దరూ మాట్లాడుకోవడానికి కూడా ఇష్టపడని పరిస్థితి వచ్చింది. ఓ దశలో శ్రీసత్య, కీర్తికి సారీ చెప్పినా.. ఆ క్షమాపణను కీర్తి యాక్సెప్ట్ చేయలేదు. శ్రీ సత్య మాత్రం.. అనాల్సినవి అనేసి, ఆ తర్వాత ‘ఆల్ ఈజ్ వెల్’ అన్నట్టుగా కలిసిపోయేందుకు ప్రయత్నించింది.
శ్రీ సత్య మీద ఇప్పటికే కన్నింగ్ అనే ముద్ర పడగా, ఈ ఎపిసోడ్‌తో అది మరింత బలపడిపోయింది. శ్రీసత్య మాటలతో కీర్తి ఏడవగా, మెరీనా ఆమెని ఓదార్చింది.