Sri Reddy : అతనితో డేటింగ్ చేయాలని ఉంది.. శ్రీరెడ్డి బోల్డ్ కామెంట్లు..!
NQ Staff - February 25, 2023 / 01:30 PM IST

Sri Reddy : కాంట్రవర్సీ బ్యూటీ శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కాస్టింగ్ కౌచ్ ఉద్యమం పేరుతో ఆమె బాగా ఫేమస్ అయిపోయింది. అప్పటి నుంచే ఆమె అందరి మీద విమర్శలు చేయడం స్టార్ట్ చేసింది. అయితే మొదట్లో ఉద్యమం గురించి మాట్లాడిన శ్రీరెడ్డి.. రాను రాను హీరోలపై కావాలనే ఆరోపణలు చేయడం స్టార్ట్ చేసింది.
దాంతో ఆమె కావాలనే కొందరు హీరోలను టార్గెట్ చేస్తోందిన అంతా ఆమెను దూరం పెట్టేశారు. అప్పటి నుంచి ఆమెను ఎవరూ పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ శ్రీరెడ్డి మాత్రం ఆరోపణలు చేయడం ఆపట్లేదు. ఎప్పుడు ఏ హీరోలపై ఎలాంటి కామెంట్లు చేస్తుందో చెప్పడం చాలా కష్టంగా మారిపోయింది.
తాజా ఇంటర్వ్యూలో..

Sri Reddy Wants To Dating Prabhas
ఇక మెగా ఫ్యామిలీ అంటేనే ఒంటికాలిపై లేస్తుంది ఈ ముద్దుగుమ్మ. కానీ ఆమె నోటితో పొగిడిన హీరోలు మాత్రం చాలా తక్కువ. అలాంటి వారిలో ప్రభాస్ కూడా ఒకరు. ప్రభాస్ అంటే తనకు ఎంతో ఇష్టం అని ఎన్నోసార్లు శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీరెడ్ది మరో అడుగు ముందుకు వేసింది.
ప్రభాస్ తో ఒక్కరోజైనా డేటింగ్ చేయాలని ఉందంటూ పచ్చి బూతులు మాట్లాడేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అది చూసిన ప్రభాస్ ఫ్యాన్స్.. నీ మొహానికి ప్రభాస్ కావాలా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. నీ ముఖాన్ని అద్దంలో చూసుకో అంటూ వల్గర్ కామెంట్లు పెడుతున్నారు డార్లింగ్ ఫ్యాన్స్.