Sreemukhi: స‌రికొత్త లుక్‌లో క‌నిపిస్తున్న శ్రీముఖి.. ఫ‌న్నీ కామెంట్స్ పెడుతున్న నెటిజ‌న్స్

Sreemukhi: బుల్లితెర పాపుల‌ర్ యాంక‌ర్స్‌లో శ్రీముఖి ఒక‌రు. ఈ ముద్దుగుమ్మ త‌న అంద‌చందాల‌తో పాటు ప‌దునైన మాట‌ల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఉంటుంది. ఓ వైపు బుల్లితెరపై స్టార్‌ యాంకర్‌గా కొనసాగుతూనే మరోవైపు వెండితెరపై కూడా తన అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటుంది .ఇటీవ‌ల సినీ గాయకుడు మనో, నటులు రాజా రవీంద్ర, భరణిలతో కలిసి ‘క్రేజీ అంకుల్స్’ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా పెద్ద‌గా హిట్ కాలేదు.

Sreemukhi Latest Sizzling Stills
Sreemukhi Latest Sizzling Stills

శ్రీముఖి ప్ర‌స్తుతం ప‌లు టీవీ షోస్‌తో బిజీగా ఉంది. ఆ షోల కోసం డిఫ‌రెంట్ స్టైల్‌లో రెడీ అవుతూ నెటిజ‌న్స్‌కి మంచి వినోదం పంచుతుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ నిండైన దుస్తుల‌లో స‌రికొత్త‌గా క‌నిపిస్తుంది. శ్రీముఖిని చూసి భాగ‌మ‌తి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Sreemukhi Latest Sizzling Stills
Sreemukhi Latest Sizzling Stills

అవినాష్‌, భానుతో క‌లిసి ఎక్కువ‌గా సంద‌డి చేస్తూ నెటిజ‌న్స్ ని ఎంట‌ర్‌టైన్ చేస్తూ ఉంటుంది శ్రీముఖి. ఆ మ‌ధ్య ఈ అమ్మ‌డు పర్సనల్‌ లైఫ్‌కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. పెళ్లి చేసుకోవడానికి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. మంచి వ్యక్తి దొరకడానికి టైం పడుతుంది. ఏదైనా మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు నాకు 28 ఏళ్లు. సో 31 ఏళ్లు వచ్చేసరికి పెళ్లి చేసుకోవాలనుంది అంటూ తన మనసులో మాటను బయటపెట్టేసింది.

Sreemukhi Latest Sizzling Stills
Sreemukhi Latest Sizzling Stills

తన ఎనర్జీ, గ్లామర్ తో శ్రీముఖి యాంకర్ గా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లో అందాల యాంకర్ గా గుర్తింపు సొంతం చేసుకున్న శ్రీముఖి బుల్లితెర షోలతో పాపులర్ అయింది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది. బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే వెండితెరపై కూడా మెరవాలని శ్రీముఖి ప్రయత్నిస్తోంది.

Sreemukhi Latest Sizzling Stills
Sreemukhi Latest Sizzling Stills

బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి సత్తా చాటింది. ఎక్కడైనా తాను గట్టి పోటీ ఇవ్వగలనని నిరూపించుకుంది. తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విన్నర్ శ్రీముఖి అనే ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ చివరకు శ్రీముఖి రన్నరప్ తో సరిపెట్టుకుంది. రాహుల్ విజేతగా నిలిచాడు.

Sreemukhi Latest Sizzling Stills
Sreemukhi Latest Sizzling Stills
Sreemukhi Latest Sizzling Stills
Sreemukhi Latest Sizzling Stills