Sreemukhi : రాములమ్మ వెల్వెట్ షైన్స్: శ్రీముఖి అందాల అరాచకం.! రెచ్చగొట్టేస్తోందిగా.!
NQ Staff - October 10, 2022 / 06:56 PM IST

Sreemukhi : బుల్లితెరపై శ్రీముఖికి ఓ ప్రత్యేకమైన ఫాలోయింగ్ వుంది. బుల్లితెరపైనే కాదు, సోషల్ మీడియాలోనూ శ్రీ ముఖి ఓ సెన్సేషన్. ఆమె స్టైలింగ్‌కీ, గ్లామర్‌కీ పడిపోని కుర్రజనం లేరంటే అతిశయోక్తి కాదేమో.

Sreemukhi Latest Cute Photos
ఎప్పటికప్పుడే వేడి వేడిగా తన అందాల విందును సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లో ప్రదర్శిస్తుంటుంది శ్రీముఖి. తాజాగా అలాంటి ఓ స్పెషల్ గ్లామర్ ట్రీట్‌తో నెట్టింట రెచ్చిపోయింది శ్రీముఖి.
పర్పుల్ షైన్స్..

Sreemukhi Latest Cute Photos
పర్పుల్ కలర్ వెల్వెట్ ప్యాటర్న్ కాస్ట్యూమ్ ధరించిన శ్రీముఖి, కుర్రోళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ధై కట్ ఈ డ్రస్‌లో శ్రీముఖి స్టైలింగ్ నిజంగానే కెవ్వు కేక అనేలా వుంది. సిల్వర్ కలర్ లాంగ్ ఇయర్ రింగ్స్ శ్రీ ముఖి అందాల్ని మరింత రెట్టింపు చేస్తున్నాయ్.

Sreemukhi Latest Cute Photos
సిల్వర్ మ్యాచింగ్‌లో వేసిన షూస్ అమ్మాయిల్లో ట్రెండ్ సృష్టిస్తున్నాయ్. ఇక, కిల్లింగ్ చూపులతో రాములమ్మ చేస్తున్న అందాల రచ్చకు నెటిజనం ఫిదా అయిపోతున్నారంటే నమ్మి తీరాల్సిందే.

Sreemukhi Latest Cute Photos
బుల్లితెరపై రియాల్టీ షోలూ, సినిమా ఫంక్షన్లతో బిజీగా వుండే శ్రీ ముఖి, వీలు చిక్కితే పెద్ద తెరపై అడపా దడపా తనదైన పాత్రలతో మెప్పిస్తుంటుంది. అన్నట్లు ఇటీవల ‘గాడ్ ఫాదర్’ మూవీ ప్రమోషన్ల సందర్భంగా, మెగాస్టార్ చిరంజీవితో కలిసి స్పెషల్ జెట్ విమానంలో ప్రయాణిస్తూ చేసిన వీడియోతో శ్రీముఖి రేంజ్ మరింత పెరిగిపోయిందని చెప్పొచ్చు.