Sreemukhi : బుల్లితెర స్టార్ యాంకర్స్‌లో శ్రీముఖి పేరు తప్పక ఉంటుంది. నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న శ్రీముఖి తర్వాత యాంకర్‌గా స్థిరపడింది. వీలున్నప్పుడల్లా సినిమాలలో చిన్న చితకా పాత్రలు చేస్తూ మెప్పిస్తుంది. టాలీవుడ్ లో ఎనర్జిటిక్ యాంకర్ గా, బుల్లితెర రాములమ్మగా గుర్తింపు సొంతం చేసుకుంది శ్రీముఖి. శ్రీముఖి అందంతో కూడా అభిమానులని ఆకర్షిస్తూ ఉంటుంది. ఎలాంటి షోలో అయినా కామెడీ పంచ్ లతో శ్రీముఖి చెలరేగిపోతుంది.

శ్రీముఖి క్యూట్ లుక్స్..
‘జులాయి’తో నటిగా కెరీర్‌ను మొదలెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘నేను శైలజ’, ‘జెంటిల్‌మెన్’ వంటి చిత్రాల్లో మంచి మంచి పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘బాబు బాగా బిజీ’ వంటి సినిమాల్లో హీరోయిన్‌గా నటించి విపరీతంగా ఫేమస్ అయిపోయింది. ఆ తర్వాత పలు టీవీ ఆఫర్స్ ఈ అమ్మడిని పలకరించాయి.

యాంకర్‌గా ఫుల్ బిజీగా గడుపుతోన్న సమయంలోనే శ్రీముఖి బిగ్ బాస్ షోలోకి మూడో సీజన్ కంటెస్టెంట్‌గా వెళ్లింది. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఆమె.. రన్నరప్‌గానే మిగిలిపోయింది. ఇందులో గెలవకున్నా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. అదే సమయంలో ఆఫర్లను కూడా అందుకుంటోంది. మొత్తానికి ఈ షో తర్వాత స్పీడు పెంచేసి మరీ తన కెరీర్‌ను నడుపుకుంటోంది.

ఒకవైపు సినిమాలు, మరోవైపు టీవీ షోలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోన్నా హాట్ యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగా ప్రతిరోజూ పోస్టులు చేస్తూనే ఉంటోంది.

ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలు, విశేషాలను పంచుకుంటోంది.

శ్రీముఖి తాజాగా షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోస్ ఇంటర్నెట్ ని బ్రేక్ చేసే విధంగా ఉన్నాయి.

ఓపెన్ నెక్ టాప్ ఉన్న బ్లౌజ్ లో , పింక్ శారీలో మెరుపులు మెరిపిస్తోంది. శ్రీముఖిని ఈ పిక్స్ లో చూస్తుంటే బరువు తగ్గి నాజూగ్గా మారినట్లు అనిపిస్తోంది.
