Sreeleela : మహేష్‌బాబు సరసన శ్రీలీల.! లక్కీ ఛాన్స్ కొట్టేసిందిగా.!

NQ Staff - November 26, 2022 / 01:20 PM IST

Sreeleela  : మహేష్‌బాబు సరసన శ్రీలీల.! లక్కీ ఛాన్స్ కొట్టేసిందిగా.!

Sreeleela   : తొలి తెలుగు సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించకపోయినా, తెలుగు బ్యూటీ శ్రీలీలకి అవకాశాలు బాగానే వస్తున్నాయ్.! బాగానే రావడమేంటి, సూపర్బ్ ఛాన్సులు దక్కించుకుంటోంది ఈ బ్యూటీ.

మాస్ మహరాజ్ రవితేజ సరసన ‘ధమాకా’ అనే సినిమాలో శ్రీలీల నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇవి కాక మరో రెండు మూడు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ శ్రీలీల చేతిలో వున్నాయి.

మహేష్‌తో శ్రీలీల ఆన్ స్క్రీన్ రొమాన్స్.!

మహేష్‌బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్దే ఈ సినిమాలో హీరోయిన్. కాగా, మరో హీరోయిన్‌గా శ్రీలీలకి ఛాన్స్ దక్కిందట.

త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పునఃప్రారంభం కాబోతోంది. ఆ షూట్‌తోనే శ్రీలీల సెట్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతోందని సమాచారం. తెలుగమ్మాయే అయినా, కన్నడ సినిమాలతో శ్రీలీల పాపులర్ అయ్యింది. తెలుగులో ఆమెకి తొలి సినిమా ‘పెళ్ళి సందడి’.!

ఎన్ని సినిమాలు చేసినాగానీ, మహేష్‌తో సినిమా అంటే ఆ కిక్కే వేరప్పా.! ఔను, శ్రీలీల దశ ఈ సినిమాతో తిరిగినట్లే బావించాలేమో.!

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us