South Films : రీమేకులతో ట్రోలవుతున్న బీటౌన్, సౌత్ మ్యాజిక్ మ్యాచ్ చేయలేక పరేషాన్

NQ Staff - November 24, 2022 / 02:35 PM IST

South Films : రీమేకులతో ట్రోలవుతున్న బీటౌన్, సౌత్ మ్యాజిక్ మ్యాచ్ చేయలేక పరేషాన్

South Films : సౌత్ సినిమాలకి నేషన్ వైడుగా ఏ రేంజ్ క్రేజ్ ఉందో, ఇక్కడి స్టార్సుకి అన్ని భాషల ఇండస్ట్రీలోలనూ ఎంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోందో చూస్తూనే ఉన్నాం. కొంతకాలంగా ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మూవీ అనే టాక్ ని పూర్తిగా చెరిపేస్తూ ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా సత్తా చాటుతున్నాయి సౌత్ చిత్రాలు. దాంతో కొత్త కథలతో రిస్క్ చేసేకంటే సౌత్ సినిమాలనే రీమేక్ చేసి బీటౌనులోనూ బంపర్ హిట్ కొడదామన్న ప్లానుల్లో బిజీ అయ్యారు నార్త్ మూవీమేకర్స్. అలా రానున్న అప్ కమింగ్ రీమేక్సే షెహ్ జాదా, భోళా.

త్రివిక్రమ్ డైరెక్షన్లో అల్లు అర్జున్ హీరా వచ్చిన అలవైకుంఠపురంలో మూవీ వసూళ్ల పరంగా రికార్డులను క్రియేట్ చేసి బన్నీ కెరీర్లోనే టాప్ మూవీగా నిలిచింది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ప్రాపర్ గా ఉండడంతో బాలీవుడ్ కన్ను ఈ బ్లాక్ బస్టర్ పై పడింది. కార్తీక్ ఆర్యన్, క్రితిసనన్ జంటగా రోహిత్ దావన్ దర్శకత్వంలో షెహ్ జాదా పేరుతో రీమేకవుతోందీ సినిమా.

వచ్చే ఏడాది ఫిబ్రవరి 10న థియేటర్లలోకి ఎంట్రీ ఇవ్వనుంది. అయితే లేటెస్టుగా రిలీజైన టీజర్ కు మాత్రం ఆడియెన్స్ నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే నెగిటివ్ కామెంట్సే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

ఈ టీజర్ చూశాక అల్లు అర్జున్ పై రెస్పెక్ట్ డబులయ్యిందంటూ సోషల్మీడియాలో ఓపెన్ గానే పోస్టులేస్తున్నారు నెటిజన్స్. అసలు ఆ మూవీకున్న సెన్సిబిలిటీ ఏంటి? ఈ రీమేకులో తీసిందేంటి? కావాలంటే డబ్ చేసుకుని మురిసిపోండి కానీ.. ఇలా బాలీవుడ్ మాస్ మసాలాలు దట్టించకండయ్యా బాబూ అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి కామెంట్స్ హిందీ ఆడియెన్సే ఎక్కువగా చేయడం ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్.

మరోవైపు కార్తీ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఖైదీ మూవీని అజయ్ దేవగన్ భోళా పేరుతో రీమేక్ చేస్తున్నాడు. హీరోగా నటించడంతో పాటు డైరెక్ట్ చేస్తూ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చ్ 30న విడుదల కానుంది. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ కూడా రిలీజైంది. టీజర్లోని కొన్ని షాట్స్, జైల్లో ఎలివేషన్ సీన్స్ చూశాక అసలిది ఖైదీ రీమేకేనా? అంటూ ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. బాలీవుడ్ ఆడియెన్స్ కోరుకునే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటేనే అక్కడా సినిమా సక్సెసవుతుంది.

ఆ మాట ఎవరూ కాదనలేని నిజమే. కానీ అసలిది ఖైదీ రీమేకని చెప్తే గానీ తెలీనంతలా చేంజెస్ చేస్తే ప్రేక్షకులు కన్విన్స్ అవుతారా అనేదే పెద్ద క్వశ్చన్. వాస్తవానికి అజయ్ దేవగన్ రన్ వే 34, శివాయ్ లాంటి చిత్రాలతో దర్శకుడిగా తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు.

కానీ భోళా మాత్రం రీమేక్ చిత్రం. అందులోనూ విక్రమ్ లాంటి బడా హిట్ తర్వాత లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ పై అన్ని భాషల ఆడియెన్సుకి ఐడియా వచ్చేసింది. దీంతో భోళా చిత్రంపై బోలెడన్ని కామెంట్స్ అయితే పాస్ అవుతూనే ఉన్నాయి.

South Films Difficult Task To Remake In Bollywood

South Films Difficult Task To Remake In Bollywood

చెప్పాలంటే ఓ హిట్ సినిమాని రీమేక్ చేసి మళ్లీ హిట్ కొట్టడం అంత ఈజీ ఏమీ కాదు. ఏ మాత్రం సేమ్ ఉన్నా.. ఉన్నది ఉన్నట్టుగా తీసినప్పుడు కోట్లు ఖర్చు పెట్టి రీమేక్ ఎందుకు చేయడం అంటూ ఆడియెన్సే కామెంట్స్ చేస్తారు. నిజమే. కానీ ఒరిజినల్ మూవీలో ఉన్న సోల్ మిస్సవకూడదు కదా. అలా చేసి చేతులు కాల్చుకున్న మేకర్స్, అలాంటి డిజాస్టర్ రీమేకులూ బాలీవుడ్లో లేకపోలేదు.

పైగా ఇప్పుడున్న పరిస్థితుల్లో సౌత్ చిత్రాలకి పెరిగిన క్రేజ్ పరంగా చూస్తే బాలీవుడ్లో ఇక్కడి మ్యాజికుని మ్యాచ్ చేయడం ఇంకా కష్టమైన పనే. మరి సినిమా పూర్తయి థియేటర్లోకొచ్చాక రీమేక్ ప్రాజెక్టుగా మార్పులు చేస్తూనే, అక్కడి ఆడియెన్సుకి ఆకట్టుకుంటారా? అనేది తెలియాలంటే స్క్రీన్ పై బొమ్మ పడే వరకు వెయిట్ చేయాల్సిందే.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us