Krishnam Raju : కృష్ణంరాజు సంస్మరణ కాదు, రాజకీయ స్మరణ.? ప్రభాస్ కష్టం వృధా.?

NQ Staff - September 30, 2022 / 03:08 PM IST

Krishnam Raju : కృష్ణంరాజు సంస్మరణ కాదు, రాజకీయ స్మరణ.? ప్రభాస్ కష్టం వృధా.?

Krishnam Raju : టన్నుల కొద్దీ మటన్, చికెన్, చేపలు, రొయ్యలు.. వాటితో బోల్డన్ని వంటకాలు.. రెండు లక్షలకు పైన బూరెలు.. వెరసి, కోట్లాది రూపాయల ఖర్చు.! అయితేనేం, లక్ష మందికి పైగా భోజనం చేశారు.. అదీ తృప్తిగా. కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమానికి సంబంధించి ఇది ‘నాణానికి ఓ వైపు’ మాత్రమే.!

రెండో కోణం ఏంటో తెలుసా.? రాజకీయం.! కృష్ణంరాజు కుటుంబం రాజకీయాల్లోకి రాబోతోందంటూ పెద్దయెత్తున ప్రచారం చేశారు కొందరు. ‘మా పార్టీలోకే రాబోతున్నారు..’ అంటూ అధికార వైసీపీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. కృష్ణంరాజు పేరుతో స్మృతివనం ఏర్పాటుకు రెండెకరాల భూమిని అందించనున్న ప్రభుత్వం.. అంటూ రాజకీయ ప్రకటనలు చేశారు వైసీపీ నేతలు, అందునా మంత్రులు.

ప్రభాస్ వృధా ప్రయాస..

చాలాకాలం తర్వాత సొంతూరుకి వెళ్ళాడు ప్రభాస్. కృష్ణంరాజు కుటుంబ సభ్యులంతా కలిసి ఈ సంస్మరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చినవారిని ఉద్దేశించి ప్రభాస్ మాట్లాడాడు. అయితే, ఎక్కడా కృష్ణంరాజు కుటుంబ సభ్యులు రాజకీయాలకు తావివ్వలేదు.

అయితే, ప్రభాస్ సహా కృష్ణంరాజు కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన పలువురు రాజకకీయ నాయకులు నవ్వుతూ ఫొటోలకు పోజులివ్వడం చర్చనీయాంశ మయ్యింది. ఇది వివాహ వేడుక కాదు, సంస్మరణ సభ.. అన్న ఇంగితం కూడా సోకాల్డ్ రాజకీయ నాయకులకు లేకుండా పోయింది.

ఖర్చు దండగ.. వృధా ప్రయాస.. ఎందుకంటే రాజకీయమే ఈ మొత్తం వ్యవహారాన్ని హైజాక్ చేసిందంటూ ప్రభాస్ కుటుంబ సభ్యులపై సానుభూతి చూపించే పరిస్థితి వచ్చింది. రాజకీయం అంటే ఇలానే వుంటుంది మరి.!

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us