Vijay Devarakonda : ఈడీ విచారణపై ‘రౌడీ’ విజయ్ వెటకారం.! ఇదే తగ్గించుకుంటే మంచిది.!
NQ Staff - December 1, 2022 / 11:08 AM IST

Vijay Devarakonda : ఒకప్పుడు ఆ యాటిట్యూడ్‌కి అభిమానులు ఫిదా అయ్యారు. కానీ, ప్రతిసారీ అదే యాటిట్యూడ్ చూపిస్తే, ‘లైగర్’ లాంటి పరాజయాల్నే ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ వస్తున్న విజయ్ దేవరకొండ తన పద్ధతి మార్చుకోవడంలేదు.
‘లైగర్’ సినిమా ఫెయిల్యూర్ ఇవ్వడమే కాదు, ఈడీ విచారణకూ కారణమయ్యింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.
టైమ్ పాస్ చేసొచ్చినట్టున్నాడు..
ఈడీ విచారణకు హాజరై, అనంతరం మీడియాతో మాట్లాడాడు విజయ్. ‘పాపులారిటీ వల్ల వచ్చిన సమస్య ఇది.. మీ అభిమానం ఎక్కువైపోతే ఇలాంటివే వస్తాయ్.. ఇదొక కొత్త అనుభవం..’ అంటూ వెటకారంగా మాట్లాడాడు విజయ్. విజయ్ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్.
పవన్ కళ్యాణ్, మహేష్‌బాబు.. లాంటి స్టార్లతో పోల్చితే, విజయ్ స్టార్డమ్ అంత ఎక్కువేం కాదు. చిరంజీవి, బాలకృష్ణ లాంటోళ్ళున్నారు సినిమా ఇండస్ట్రీలో. పాపులారిటీ ఎక్కువైతే, ఈడీ విచారణలు జరుగుతాయా.? ఈడీ అంటే అంత వెటకారమా.? అంటూ విజయ్‌పై మండిపడుతున్నారు.
బాధ్యతగల పౌరుడిగా విచారణ సంస్థలపై గౌరవముంచాలి, విచారణకు సహకరించాలి. ఈ విషయంలో కూడా యాటిట్యూడ్, వెటకారం చూపించడమంటే.. అది బాధ్యతారాహిత్యమే.!