Samantha : సమంత ఏంటీ ఛండాలం.? దారుణమైన ట్రోలింగ్.!

NQ Staff - September 23, 2022 / 06:31 PM IST

160331Samantha : సమంత ఏంటీ ఛండాలం.? దారుణమైన ట్రోలింగ్.!

Samantha : సమంతకి సోషల్ మీడియాలో అభిమానులెక్కువ.. అలాగే దురభిమానులూ ఎక్కువే.! అత్యంత హేయంగా ఆమెను ట్రోల్ చేస్తుంటారు కొందరు. వారికి కౌంటర్ ఎటాక్ ఇస్తుంటారు మరికొందరు.!

Social Media Trolls on Samantha

Social Media Trolls on Samantha

తన తాజా సినిమా ‘శాకుంతలం’ రిలీజ్ డేట్ రావడం కూడా సమంత ట్రోలింగ్ ఎదుర్కోవడానికి కారణమవుతోంది. సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ రివీల్ చేసిన పోస్టర్ కాస్తా సమంత మీద భయంకరమైన ట్రోలింగ్‌కి కారణమయ్యింది. ఏంటీ ఛండాలం.? అంటూ సమంతని కొందరు నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.

ఏముంత వల్గారిటీ వుందని.?

నాభీ చూపిస్తే ఛండాలమా.? లేదంటే, ఇంకెవరికో సమంత జోడీగా నటించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారా సోకాల్డ్ దురభిమానులు.? ఏమో, కారణం ఏదైనాగానీ.. సమంత మీద అత్యంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు కొందరు నెటిజన్లు.

నాగ చైతన్య అభిమానులే ఇదంతా చేస్తున్నారా.? అంటే, ‘కాదు’ అని చెప్పలేం. నాగచైతన్య బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ చవిచూస్తున్నాడు. అదే సమయంలో సమంత ఇమేజ్ గ్రాఫ్ పెరుగుతోంది. నిజానికి నాగచైతన్య తన మాజీ భార్య సమంతని లైట్ తీసుకున్నాడు. అసలామె ప్రస్తావనే తీసుకురావడంలేదు.

అభిమానులు అంత తేలిగ్గా సమంతని వదిలి పెట్టేలా కనిపించడంలేదు. కానీ, ఎన్నాళ్ళిలా.? ఇప్పుడే ఇలా వుంటే, ‘శాకుంతలం’ సినిమా విడుదలైతే.. ఆ తర్వాత కథ ఎలా వుంటుందో ఏమో.!