Karan Johar : ఛీ..ఛీ.. కరణ్ జోహార్ బుద్ధి గడ్డి తినేసిందా.?

NQ Staff - July 26, 2022 / 08:55 PM IST

Karan Johar : ఛీ..ఛీ.. కరణ్ జోహార్ బుద్ధి గడ్డి తినేసిందా.?

Karan Johar : చిన్న కుర్రాడేమీ కాదు.! వయసు మీద పడిందిగానీ, ఏం లాభం.? టాక్ షో పేరుతో అత్యంత అసభ్యకరమైన ప్రశ్నలేయడం ఎంతవరకు సబబు.? ఇలా చాలా చర్చ జరుగుతోంది బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహార్ గురించి.

Social Media trolls on Karan Johar

Social Media trolls on Karan Johar

కాఫీ విత్ కరణ్ అంటే, అదొక బూతు ప్రోగ్రామ్ అనే పేరుంది. ట్రెండ్ మారింది. స్పైసీ క్వశ్చన్స్ సెలబ్రిటీలను అడిగితే, ఆ కిక్కే వేరప్పా. అందుకే, ఆ ప్రోగ్రామ్ అంత హిట్టు. కొత్త సీజన్‌కి మరింత ‘స్పైసీనెస్’ యాడ్ చేసినట్టున్నాడు కరణ్ జోహార్.

విజయ్ దేవరకొండకి త్రీసమ్ క్వశ్చన్.!

త్రీసమ్.. అదేనండీ, ముగ్గురు కలిసి శృంగారం చేయడం. ఈ అంశంపై విజయ్ దేవరకొండని ప్రశ్నించాడు కరణ్ జోహార్. ‘ఇప్పటికైతే లేదు, ఏమో.. ముందు ముందు వుంటుందేమో..’ అన్నట్లుగా సమాధానమిచ్చాడు విజయ్ దేవరకొండ.

ఇదేం ప్రశ్న.? ఎప్పుడూ బోల్డ్‌గా మాట్లాడే విజయ్ దేవరకొండ కూడా ఒకింత సిగ్గుపడాల్సి వచ్చింది. పక్కనే బాలీవుడ్ నటి అనన్య పాండే (లైగర్ సినిమా కోసం విజయ్ దేవరకొండతో ఆన్ స్క్రీన్ రొమన్స్ చేస్తోంది) కూడా వుంది.

వయసు మీద పడే కొద్దీ వున్న మతి పోతున్నట్టుంది.. లేదంటే, తనను తాను శృంగార పురుషుడిగా చాటి చెప్పుకునేందుకు ఇలా కరణ్ జోహార్ చేస్తున్నాడా.?

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us