Anasuya : అనసూయపై పేలుతున్న సెటైర్లు.! తప్పదు, భరించాల్సిందే మరి.!
NQ Staff - August 14, 2022 / 11:37 PM IST

Anasuya : హైపర్ ఆది, అనసూయ మధ్య జబర్దస్త్ వేదికపై జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. అనసూయ భర్త మీద ఆది వేసే పంచ్‌లు.. అబ్బో, ఆ ‘దారుణం’ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆది మీద సున్నితంగా కసురుకుంటూనే, అతన్ని అనసూయ ఎంకరేజ్ చేసిన వైనం ఎవరికి తెలియదు.?

social media trolls on Jabardasth Anasuya comments
మేనేజర్ మీదా, జడ్జిల మీదా, తోటి కంటెస్టెంట్ల మీదా.. చవకబారు కామెడీ చేయడమే ‘జబర్దస్త్’ అయిపోయింది. అదే జబర్దస్త్ సక్సెస్ సీక్రెట్‌గా కూడా మారిపోయింది. డబుల్ మీనింగ్ డైలాగులు, శృంగార పరమైన సన్నివేశాలు.. ఇంతేనా.? ఇంతకన్నా ఇంకేమీ లేదా.?
అనసూయ అప్పుడలా, ఇప్పుడిలా.!
చెయ్యాల్సిందంగా చేసేసి, జబర్దస్త్ స్టేజ్ మీద ఏదో జరగకూడనిది జరిగిపోయిందంటూ ఇప్పుడు అనసూయ చెబుతోంది. అప్పట్లో తనకు కొన్ని ఇష్టం లేకపోయినా చేయాల్సి వచ్చిందనీ, తీసుకున్న పేమెంటుకి న్యాయం చేశాననీ, కొన్ని విషయాల్లో తాను కసురుకున్నా దాన్ని చూపించలేదని అనసూయ తాజాగా చెప్పుకొచ్చింది.
వృద్ధ నారీ డాష్ డాష్.. అన్న చందాన, ఇప్పుడు.. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక, ఆనాటి ఆ ఘోరాల గురించి తాపీగా చెబుతోంది అనసూయ. తప్పు కదా.? జబర్దస్త్ నుంచి బయటకు వచ్చాక బురద జల్లడం సబబు కాదు కదా.? అని నెటిజనం అనసూయని ఏకి పారేస్తున్నారు.
‘అప్పుడే ఆ షో నుంచి బయటకు వచ్చేసి వుండాల్సింది.. అంతా అయిపోయాక, ఇప్పుడు బయటకు వచ్చి.. నువ్వేదో ఉత్తమురాలిలా బిల్డప్ ఇస్తే ఎలా.?’ అంటూ అనసూయని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.