Social Media : సోషల్ తలనొప్పి: నిన్న ‘మాచర్ల’ దర్శకుడు, నేడు ‘రామారావు’ దర్శకుడు.!
NQ Staff - July 29, 2022 / 05:00 AM IST

Social Media : ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా దర్శకుడు ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి, ట్వీట్ల వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. గతంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ట్వీట్లేస్తూ, కులగజ్జి ప్రదర్శించాడనే విమర్శలు సోషల్ మీడియా వేదికగా వెల్లువెత్తుతున్నాయి. అయితే, తన పేరుతో కొన్ని ఫేక్ ట్వీట్లను ఎవరో సృష్టించారని ‘మాచర్ల నియోజకవర్గం’ దర్శకుడు రాజశేఖర్ రెడ్డి, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Social Media Trolls on film directors
నితిన్ హీరోగా తెరకెక్కుతోన్న ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే. సినిమా ప్రమోషన్లు చాలా జోరుగా జరుగుతున్న తరుణంలో, సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయిన నేపథ్యంలో ఈ వివాదం చిత్ర యూనిట్ వర్గాల్ని ఇబ్బంది పెడుతోంది. హీరో నితిన్ కూడా తమ దర్శకుడ్ని వెనకేసుకొచ్చాడు.
రామారావు దర్శకుడు శరత్ మీదా అదే ఎటాక్..
రవితేజ హీరోగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి శరత్ మండవ దర్శకుడు. గతంలో ఈయన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అనుకూలంగా మాట్లాడాడనీ, అప్పట్లో వైసీపీకి వ్యతిరేకంగా నినదించాడనీ ఆరోపిస్తూ వైసీపీ మద్దతుదారులు ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాని బాయ్‌కాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
దీన్ని ఫేక్ వ్యవహారంగా శరత్ మండవ అలాగే ‘రామారావు ఆన్ డ్యూటీ’ మేకర్స్ తీవ్రంగా ఖండిస్తున్నారు. కొందరు పనీ పాటా లేని వ్యక్తులు చేస్తున్న ఈ తరహా ఫేక్ ట్వీట్ వార్ వల్ల సినీ పరిశ్రమ దెబ్బతింటోందన్న భావన అంతటా వ్యక్తమవుతోంది.
సినిమాలకు బలవంతంగా రాజకీయం పులమడం ఇదే కొత్త కాదు. ‘సర్కారు వారి పాట’ సినిమా విషయంలోనూ రాజకీయ రచ్చ జరిగిన సంగతి తెలిసిందే. అందులో ఓ డైలాగ్ చుట్టూ యాగీ జరిగింది.