Dil Raju : దిల్ రాజు గ్లామర్‌పై బీభత్సమైన ట్రోలింగ్.!
NQ Staff - December 16, 2022 / 11:46 AM IST

Dil Raju : ‘మీరు అందంగా వుంటారు కదా.! హీరోగా సినిమాలెందుకు చెయ్యకూడదు.?’ అన్న ప్రశ్న ప్రతిసారీ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముందుకొస్తుంటుంది. ‘ముఖస్తుతి’ అని దీన్నే అంటుంటారు.
నిజానికి, దిల్ రాజే అలాంటి ప్రశ్న వేయించుకుంటారన్న వాదన లేకపోలేదు. సినీ పరిశ్రమలో దిల్ రాజు ఎదిగిన వైనంపై కథలు కథలుగా వినిపిస్తుంటాయ్.! ఆ సంగతి పక్కన పెడితే, ‘నేను అందంగా వుంటానేమో..’ అంటూ దిల్ రాజు తాజాగా వ్యాఖ్యానించడంపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది.
సొంత డబ్బా కొట్టుకుంటున్న దిల్ రాజు..
నో డౌట్.. తెలుగు రాష్ట్రాల్లో ఏ పెద్ద సినిమా రిలీజ్ అవ్వాలన్నా థియేటర్ల విషయంలో దిల్ రాజుని ప్రసన్నం చేసుకోవాల్సిందే. డిస్ట్రిబ్యూషన్ విషయంలో అయినా అంతే.
తమిళనాడులో మాత్రం దిల్ రాజు, అక్కడ అడుక్కోవాల్సి వస్తోందట థియేటర్లకు సంబంధించి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ‘వారిసు’ సినిమా కోసం తమిళనాడులో పడుతున్న పాట్లు గురించి దిల్ రాజు చెప్పుకొచ్చారు. ‘ఇది వ్యాపారం.. ఇలాగే వుంటుంది..’ అని దిల్ రాజు చెప్పడం గమనార్హం.
తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు చేస్తున్నదీ అదే కదా.? అంటే, ‘ఏమో, నేను గ్లామర్‌గా వుంటానేమో.. అందుకే అందరూ నా గురించి మాట్లాడుకుంటారు..’ అని దిల్ రాజు చెప్పుకొచ్చాడు