Aadi Reddy : ఏం చెప్పినవ్ సోదిరెడ్డీ.! సామాన్యుడంటూనే ఈ సోది ఏంది.?
NQ Staff - November 16, 2022 / 08:33 AM IST

Aadi Reddy : బిగ్ బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్‌లో గెలవడం అనేది కంటెస్టెంట్ల విధి. సరే, గెలవడం ఇష్టం లేకపోతే అది వేరే కథ. గత సీజన్లలోనూ కొందరు ఓవరాక్షన్స్ చేశారు.. బయటకు వెళ్ళిపోయారు. అదీ ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగా.
అసలు ఇన్ని రోజులపాటు ఆది రెడ్డి ఎలా హౌస్‌లో వుండగలుగుతున్నాడు.? అన్నది ఓ మిలియన్ డాలర్ల ప్రశ్న. ‘బిగ్ బాస్ వీక్షకులు నాకు ఓట్లేస్తున్నారు.. అందుకే నేను ఇంకా ఇక్కడే వున్నాను..’ అని బలంగా నమ్ముతున్నాడు ఆది రెడ్డి.
బిగ్ బాస్‌ని అర్థం చేసుకున్నది ఇంతేనా..?
ఓట్లతోనే బిగ్ బాస్ రియాల్టీ షో జెన్యూన్‌గా నడిచేస్తుందనే భ్రమల్లో వున్నాడంటే, ఆది రెడ్డి ఇంతకు ముందు సీజన్లను విశ్లేషించడం ఉత్త భూటకనమన్నమాట.
ఇమ్యూనిటీని పొందడానికి, డబ్బు ఖర్చు చేయాల్సి వుంటుంది.. ఆ యూనిక్ హయ్యస్ట్ అమౌంట్ (5 లక్షలకు మించకుండా 1 లక్షకు తగ్గకుండా), ప్రైజ్ మనీ (50 లక్షలు) నుంచి తగ్గించబడుతుందన్నది ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయినవారికి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్.
‘నాకు ఇమ్యూనిటీ వద్దు బిగ్ బాస్. నేను దాన్ని కొనుక్కోను. ఎందుకంటే నాకు ఓట్లు ముఖ్యం. నన్ను బిగ్ బాస్ వీక్షకులే గెలిపించుకుంటారు..’ అంటూ ఆది రెడ్డి సోది చెప్పేశాడు. ఇంత సోది అవసరమా.? అని ఆది రెడ్డి మీద సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పడుతున్నాయి.