Vaarasudu : నేటి నుంచి షూటింగ్స్ అన్నీ బంద్.. అయిన విజయ్ మూవీ వైజాగ్‌లో ఎలా షూటింగ్ జరుపుకుంటుంది?
NQ Staff - August 1, 2022 / 12:14 PM IST

Vaarasudu : ఆగస్ట్ 1 నుంచి చిత్రీకరణలను నిలిపివేస్తున్నట్టు ఇదివరకే తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు నుంచి సెట్స్ పై ఉన్న చిత్రాలు, ప్రారంభమయ్యే కొత్త సినిమాల షూటింగ్స్ ఆగిపోనున్నాయి. కానీ ఇతర భాషలకు చెందిన సినిమా షూటింగ్స్ యాథావిధిగా కొనసాగుతాయి. అయితే తొలి తెలుగు మూవీగా వారసుడు ప్రచారం జరిగిన ఇప్పుడు బంద్ నేపథ్యంలో తమిళ మూవీగా చెప్పుకొస్తున్నారు.
భలే ప్లాన్..

Sketch of Vaarasudu Producers worked
తమిళ స్టార్ హీరో విజయ్ తొలిసారి ద్విభాషా చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. విజయ్ ఇంతకుముందు తమిళంలో చేసిన సినిమాలు తెలుగులోను విడుదలయ్యేవి. అందుకు భిన్నంగా ఈ సారి ఆయన తెలుగులో చేసిన సినిమా తమిళంలోను విడుదల కానుంది. రజనీ .. కమల్ … విక్రమ్ .. సూర్య వంటి స్టార్స్ తో పోలిస్తే, మొదటి నుంచి కూడా విజయ్ టాలీవుడ్ పై పెద్దగా దృష్టి పెట్టకపోవడం కనిపిస్తుంది.
తమిళంలో ఆయన చేసిన సినిమాలు తెలుగులో వరుసగా విడుదల కావడమనేది ఈ మధ్యనే జరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన నేరుగా ఒక తెలుగు సినిమా కూడా చేయాలని నిర్ణయించు కున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో .. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక ప్రాజెక్టును సెట్ చేసుకున్నాడు. కథానాయికగా రష్మికను తీసుకోవడం కూడా జరిగి పోయింది.
తమిళంలో ఈ సినిమాకు ‘వరిసు’ అనీ .. తెలుగులో ‘వారసుడు’ అనే టైటిల్స్ ను ఖరారు చేశారు. సాధారణంగా టాలీవుడ్ ప్రకటించిన బంద్ ప్రకారం ఈ సినిమా షూటింగ్ కూడా ఆగిపోవల్సింది. కాని దీనిని తమిళ చిత్రంగా ప్రొజెక్ట్ చేస్తూ వైజాగ్‌లో షూటింగ్ జరుపుతున్నారు. మొత్తానికి నిర్మాతల స్కెచ్ అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.