Sitaramam : ఆ రెండు సినిమాలకీ ఓటీటీ ముచ్చటే లేదాయె.!

NQ Staff - September 4, 2022 / 06:46 PM IST

156653Sitaramam : ఆ రెండు సినిమాలకీ ఓటీటీ ముచ్చటే లేదాయె.!

Sitaramam : ‘సీతారామం’ సినిమా ఎప్పుడు ఓటీటీలో వస్తుంది.? ‘కార్తికేయ-2’ సినిమా ఓటీటీలో వచ్చేదెప్పుడు.? ఈ చర్చ పెద్దగా జరగడంలేదు. గతంలో పరిస్థితి వేరు. ఏదన్నా సినిమా విడుదలవుతోందంటే, ముందుగా ఓటీటీ రిలీజ్ డేట్ లీక్ అయిపోయేది. ఒక్కోసారి రావాల్సిన సమయం కంటే ముందే సినిమాలు ఓటీటీలో వచ్చేసిన పరిస్థితుల్నీ చూశాం.

Sitaramam and Bimbisara ott release update

Sitaramam and Bimbisara ott release update

‘సీతారామం’ అలాగే, ‘బింబిసార’.. వీటితోపాటు ‘కార్తికేయ-2’ సినిమా కూడా ఖచ్చితంగా ఓటీటీలో వస్తాయ్. కాస్త సమయం పడుతుందంతే. ఓటీటీకి ఇవ్వకుండా అయితే వుండరు కదా.?

ప్రేక్షకుల ఆలోచనల్లో మార్పు వచ్చింది..

ఓటీటీలో బొమ్మ వచ్చినా, థియేటర్లలో సినిమా చూస్తే ఆ కిక్కే వేరప్పా.. అనుకుంటారు అభిమానులు. టిక్కెట్ల ధరల గోల తగ్గింది. కోవిడ్ టెన్షన్ అసలే లేదు. పైగా, కొన్ని మంచి సినిమాలూ రావడంతో, సగటు సినీ ప్రేక్షకుడు మళ్ళీ థియేటర్ల వైపు వెళుతున్నాడు.

దాంతో, సహజంగానే ఓటీటీ మీద ఫోకస్ ప్రేక్షకుల్లో తగ్గిందనే చెప్పాలి. ఇది ఓ రకంగా సినీ పరిశ్రమకు కొంత ఊరట. కానీ, చెత్త సినిమాలు ఎక్కువగా రిలీజవుతూ వుంటే, మళ్ళీ థియేటర్లను జనం లైట్ తీసుకోవడం మొదలవుతుంది.

ఎవరూ కావాలని చెత్త సినిమాలు తీయరు కదా.. తీసి, నష్టపోవాలని అనుకోరు కదా.! అదంతే, ఓవర్ కాన్ఫిడెన్స్ అనండీ, చిరంజీవి చెప్పినట్లు ‘టేకిట్ గ్రాంటెడ్’ అన్నట్టు వ్యవహరించడం వల్ల అనండీ.. సినిమాలు ఫెయిలవుతుంటాయంతే.!