Siri and Shannu : హ‌గ్గులు న‌చ్చ‌లేదంటూ చుర‌క‌లు అంటించిన సిరి త‌ల్లి

Siri and Shannu : బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మం ఎంత ర‌స‌వ‌త్తరంగా మారుతుందో మ‌నం చూస్తూనే ఉన్నాం. ప్ర‌స్తుతం హౌజ్‌లో కేవ‌లం 8 మంది స‌భ్యులు మాత్ర‌మే ఉండ‌గా, వారికి వెరైటీ టాస్క్‌లు ఇస్తూ ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తున్నారు బిగ్ బాస్. తాజాగా ల‌గ్జరీ బడ్జెట్ కోసం కంటెస్టెంట్లకు బిగ్ బాస్ టాస్కులు ఇస్తారన్న సంగతి తెలిసిందే.

TheNewsQube-
siri mother comments on siri and shannu hugs
siri mother comments on siri and shannu hugs

టాస్క్‌ ఎంత బాగా ఆడితే.. అదే స్థాయిలో లగ్జరీ బడ్జెట్‌ వస్తుంది. ఇక ఈ వారం లగ్జరీ బడ్జెట్‌ కోసం ‘బీబీ ఎక్స్‌ప్రెస్’అనే టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. . ఇందులో భాగంగా చుక్ చుక్ సౌండ్ వచ్చినప్పుడల్లా కంటెస్టెంట్లు అందరూ కలిసి రైలు భోగీలుగా మారాల్సి ఉంటుంది. ఆ తర్వాత బిగ్ బాస్ కమాండ్స్ ఆధారంగా పని చేయాల్సి ఉంటుంది.

గత సీజన్‌లో మాదిరిఫ్రీజ్‌, ఫాస్ట్‌ ఫార్వర్డ్‌ అనే టాస్క్‌లో ఇది చాలా వినోదాత్మకంగా సాగుతుంది. ఇక మధ్య మధ్యలో కుటుంబ సభ్యులను ప్రవేశపెడుతున్నాడు బిగ్‌బాస్‌. నిన్న కాజల్‌ భర్త, కూతురు హౌస్‌లోకి వచ్చి సందడి చేశాడు. చాలా రోజుల తర్వాత కుటుంభ సభ్యులను కలవడంతో కాజల్‌ ఎమోషనల్‌ అయింది.

నేటి ఎపిసోడ్‌లో మానస్‌ తల్లితో పాటు.. సిరి తల్లి కూడా ఇంట్లో వచ్చినట్లు తాజాగా విడుదలైన ప్రోమో ద్వారా తెలిసింది. మమ్మి ఇంట్లోకి రావడంతో ఆనందంతో ఎగిరి గంతులేశాడు మానస్‌. ఆమె కూడా మానస్‌ని ముద్దాడుతూ.. ఎమోషనల్‌ అయింది. హౌజ్‌మేట్స్ అంద‌రితో స‌ర‌దాగా గ‌డిపింది.

ఇక సిరి తల్లి ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలో సిరి ఫ్రీజ్‌లో ఉంది. సిరిని ఫ్రీజ్‌ నుంచి రిలీజ్‌ చేయగానే… వెళ్లి తల్లిని గట్టిగా హగ్‌ చేసుకొని ముద్దుల వర్షం కురిపించింది. కూతురిని బాగా ఆడుతున్నావ్‌ అని ప్రొత్సహిస్తూనే.. షణ్ముఖ్‌ని హగ్‌ చేసుకోవడం నచ్చడంలేదని షాకింగ్‌ కామెంట్‌ చేసింది సిరి తల్లి. షణ్ముఖ్‌ సిరికి బాగా హెల్ప్‌ చేస్తున్నాడని, అందువ‌ల‌నే త‌ను అలా చేస్తుంది, ఇది తనకు నచ్చడం లేదని చెప్పింది.

షణ్ముఖ్‌ తల్లి కూడా వీళ్ల ప్రవర్తనపై ఆగ్రహంతో ఉందట! మాటిమాటికీ హగ్గులు, ముద్దులు ఇచ్చుకోవడాన్ని తప్పుపట్టిందట! షణ్నుతో ఇలా ఉండటం కరెక్ట్‌ కాదు అని సిరికి ముఖం మీదే చెప్పినట్లు సమాచారం. మరి పేరెంట్స్‌ హెచ్చరికలతోనైనా సిరి- షణ్నులో ఏదైనా మార్పు వస్తుందేమో చూడాలి!