Siri And Srihan : సిరి, శ్రీహాన్‌ లు కలిసి ఉండటానికి ఆ బుడ్డోడే కారణం

NQ Staff - November 25, 2022 / 02:36 PM IST

Siri And Srihan  : సిరి, శ్రీహాన్‌ లు కలిసి ఉండటానికి ఆ బుడ్డోడే కారణం

Siri And Srihan  : తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 ముగింపు దశకు చేరుకుంది. ప్రతి సీజన్ లో చివరికి కంటెస్టెంట్స్ యొక్క కుటుంబ సభ్యులు వస్తూ ఉంటారు. ఈ సీజన్ లో ఈ వారం ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లో అడుగు పెడుతున్నారు.

శ్రీహన్ కోసం ఆయన ప్రియురాలు సిరి వచ్చింది. సిరి తో పాటు ఒక బుడ్డోడు కూడా వచ్చాడు. వీరిద్దరూ ఇంకా పెళ్లి చేసుకోలేదు, అయినా కూడా బుడ్డోడు ఇద్దరిని అమ్మానాన్న అని పిలిచేస్తున్నాడు.

ఆశ్చర్యకర విషయం ఏంటంటే గత సీజన్ లో సిరి వ్యవహరించిన తీరుకి శ్రీహాన్‌ ఆమె నుండి దూరం అయ్యాడు అంటూ వార్తలు వచ్చాయి. నిజంగానే ఇద్దరు కొన్నాళ్ల పాటు దూరమయ్యారు. కానీ ఇద్దరు కలిసి దత్తత తీసుకున్న ఆ బుడతడి కోసం మళ్లీ కలిసి పోయారట.

కేవలం ఆ బుడ్డోడి కోసం కలిసి ఉన్నారని.. ఇద్దరం విడిపోతే అప్పుడు వాడు ఒంటరి వాడు అవుతాడు అనే ఉద్దేశంతోనే ఇద్దరు కాంప్రమైజ్ అయ్యి బ్రేకప్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారని సమాచారం అందుతుంది.

సిరి వ్యవహరించిన తీరు పట్ల ఇప్పటికీ కొందరికి అసంతృప్తిగా ఉంది, కానీ శ్రీహాన్ మాత్రం ఆమెను మంచి మనసుతో క్షమించాడని.. అతడి సన్నిహితులు మాట్లాడుకుంటూ ఉంటారు. అతడి యొక్క మంచితనంతోనే సిరి మరియు ఆ బుడ్డోడు చాలా హ్యాపీగా ఉన్నారని సమాచారం.

బిగ్‌ బాస్‌ హౌస్ లో ఈ ముగ్గురి జోడి అందరి దృష్టిని ఆకర్షించింది. అమ్మానాన్న కాకుండా అమ్మా నాన్న అయినా వీరిని చూసి ప్రతి ఒక్కరు కూడా అభినందిస్తున్నారు. నిజంగా వీరిద్దరూ చాలా గ్రేట్ అంటూ ప్రశంసలు దక్కుతున్నాయి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us