Deepthi Sunaina : దీప్తి- ష‌ణ్ముఖ్ బ్రేక‌ప్‌పై స్పందించిన సిరి.. వారి ప్రేమ అంత వీక్ కాదు..!

Deepthi Sunaina : కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు సోషల్ మీడియాలో విపరీతంగా హాట్ టాపిక్ అవుతోన్న అంశాల్లో షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునైనా బ్రేకప్ స్టోరీ ఒకటి. దాదాపు ఐదేళ్ల‌పాటు ప్రేమ‌లో మునిగి తేలిన ఈ జంట ఉన్న‌ట్టుండి విడిపోయారు. అయితే వీరిద్ద‌రు ప్ర‌స్తుతం ఎవ‌రి దారుల‌లో వారు ప‌య‌నిస్తున్నారు. ష‌ణ్ముఖ్‌- దీప్తి బ్రేక‌ప్‌కి సిరినే కార‌ణ‌మంటూ తెగ ప్ర‌చారం న‌డుస్తుంది.

Siri About Shannu and Deepthi Sunaina breakup
Siri About Shannu and Deepthi Sunaina breakup

బిగ్ బాస్ షో కంటే ముందే షణ్ముఖ్ జస్వంత్‌కు సిరి హన్మంత్ ఫ్రెండ్. దీంతో హౌస్‌లో కూడా ఆరంభం నుంచే వీళ్లిద్దరూ సన్నిహితంగా ఉన్నారు. అంతేకాదు, ఎప్పుడూ కలిసే ఉండడం.. కలిసే ఆడడం.. కలిసే తినడం.. కలిసే పడుకోవడం వంటివి చేశారు. అంతేకాదు, తరచూ ముద్దులు.. హగ్గులు చేసుకోవడం వంటి వాటితో రెచ్చిపోయారు. అంతేకాదు, ఒకానొక సందర్భంలో ఇద్దరం బాగా కనెక్ట్ అయ్యాం అని కూడా చెప్పుకున్నారు.

సిరి, ష‌ణ్ముఖ్ ప్ర‌వ‌ర్త‌న బ‌య‌ట జ‌నాల‌కు కూడా విసుగు తెప్పించింది. వీటివ‌ల‌న దీప్తి కూడా విసిగిపోయి సోషల్ మీడియా వేదికగా షణ్ముఖ్ తో విడిపోతున్నట్లు వెల్లడించారని ప్ర‌చారం జ‌రిగింది. దీప్తి ప్రకటనతో అందరి కళ్ళు సిరి వైపు మళ్ళాయి. దీప్తి షణ్ముఖ్ తో విడిపోవడానికి సిరినే కారణమంటూ వరుస కథనాలు వెలువడ్డాయి. బిగ్ బాస్ హౌస్ లో సిరి-షణ్ముఖ్ చాలా సన్నిహితంగా ఉన్నారు.

సిరికి దగ్గరైన షణ్ముఖ్ తనను మోసం చేశాడని భావిస్తున్న దీప్తి ఆయనతో విడిపోయారనేది ప్రధాన ఆరోపణ. ఇదిలా ఉంటే సిరి తాజాగా ఈ కామెంట్స్ పై స్పందించారు. వంద రోజుల ప్రయాణంలో ఎమోషనల్ గా దగ్గరయ్యాం. అయితే మా మధ్య ఉంది కేవలం స్నేహం మాత్రమే. షణ్ముఖ్ తో పాటు దీప్తి కూడా నాకు మంచి ఫ్రెండ్. దీప్తి-షణ్ముఖ్ విడిపోవడానికి కేవలం నేను కారణం అనేది నిజం కాదు.

వంద రోజుల్లో మా మధ్య ఏదో జరిగిందని విడిపోయేంత బలహీనమైన ప్రేమ కాదు వారిది. ఇక సోషల్ మీడియాలో తనపై వచ్చిన ట్రోలింగ్స్ వలన డిప్రెషన్ ఫీల్ అయ్యానని సిరి చెప్పుకోచ్చారు. మరోవైపు సిరి ..శ్రీహాన్ ప్రేమలో ఉన్నారు. సిరి కోసం శ్రీహాన్ బిగ్ బాస్ వేదికపైకి కూడా వచ్చారు. కాగా షణ్ముఖ్ పేరెంట్స్ ఈ బ్రేకప్ పై స్పందించారు. మరలా దీప్తి-షణ్ముఖ్ కలుసుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశారు.

షణ్ముఖ్ తో బ్రేకప్ తర్వాత దీప్తి సోషల్ మీడియాలో అభిమానులతో మాట్లాడారు. జీవితంలో ఎప్పుడూ ఇతరుల గురించే ఆలోచించాను, ఇకపై తన గురించి తానూ ఆలోచిస్తాను. కెరీర్ పై ఫోకస్ పెడతామని దీప్తి తెలియజేశారు. బిగ్ బాస్ సీజన్ 2లో పాల్గొన్న దీప్తి సునైన.. షణ్ముఖ్ తో కలిసి అనేక సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, సిరీస్లు చేశారు.