Singer Sunitha : సునీత-రామ్ ఫ‌స్ట్ వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ.. ప్లాన్స్ ఏంటి?

Singer Sunitha : సింగ‌ర్, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న సునీత గ‌త ఏడాది డిసెంబ‌ర్ 9న డిజిట‌ల్ మీడియా ప‌ర్స‌న్, బిజినెస్‌మెన్‌ రామ్‌ వీరపనేనిని పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసిందే. క‌రోనా స‌మయంలో వీరి పెళ్లి జర‌గ‌గా, కొద్ది మంది ప్ర‌ముఖులు మాత్ర‌మే వీరి పెళ్లికి హాజ‌ర‌య్యారు. . మొదట 19 ఏళ్ళ వ‌య‌స్సులో సునీత పెళ్లి జరిగింది.

Singer sunitha ram veerapaneni first wedding anniversary
Singer sunitha ram veerapaneni first wedding anniversary

పెళ్లయ్యాక కొన్నేళ్లకు భ‌ర్త‌తో విభేదాలు రావడంతో డైవ‌ర్స్ తీసుకున్న ఆమె పిల్ల‌ల బాధ్య‌త‌ను చూసుకుంటూ ఒంటరిగానే ఉంది. అయితే తన తల్లి సునీత‌కు తోడు కావాల‌ని భావించిన ఆమె పిల్లలిద్దరూ ద‌గ్గ‌రుండి మ‌రీ ఈ పెళ్లి చేయడం విశేషం. అయితే సునీత త‌న పెళ్లి విష‌యాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే దీనిపై భిన్న స్పందనలు వచ్చాయి. కొందరు ఆమె నిర్ణయాన్ని తప్పుబట్టారు.

42 ఏళ్ల వయసులో రెండో పెళ్లి అవసరమా? అది కూడా పెళ్లీడుకొచ్చిన పిల్లలుండగా… అంటూ విమర్శల దాడి చేశారు. అయితే మెజారిటీ వర్గం ఆమెకు మద్దతుగా నిలిచారు. 2021 జనవరి 9న రామ్-సునీత వివాహం హైదరాబాద్ లో అత్యంత సన్నిహితుల మధ్య జరిగింది. సునీత కొడుకు ఆకాష్, శ్రియ ఇద్దరూ దగ్గరుండి ఈ వివాహం జరిపించారు. రామ్ తో వివాహం అనంతరం సునీత జీవితం అందంగా మారిపోయింది.

చూస్తుండగానే రామ్-సునీత వివాహం జ‌రిగి ఏడాదైంది. ఈ క్ర‌మంలో సునీత ఇంస్టాగ్రామ్ వేదికగా ఆసక్తికర సందేశం పంచుకున్నారు. మనం ఆశలన్నీ వదులుకున్నప్పుడు ప్రేమ వెతుక్కుంటూ మన దగ్గరికి వస్తుంది. మా ఇద్దరి విషయంలో ఇది జరిగింది. ప్రతి పెళ్ళికి వెనుక ఓ కథ ఉంటుంది. ఇక మా ఈ ప్రయాణంలో ప్రేమ ఉంది.. జాయ్.. అంటూ సునీత పోస్ట్ షేర్ చేశారు.

వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా సునీత షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. అదే సమయంలో ఫ్యాన్స్ ఆమెకు బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నారు.సునీత ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్న విష‌యం తెలిసిందే.