Revanth : బిగ్ బాస్: మెరీనాని గోకుతున్న రేవంత్.! ఇది మరీ ఘోరం.!

NQ Staff - September 14, 2022 / 08:24 PM IST

158614Revanth : బిగ్ బాస్: మెరీనాని గోకుతున్న రేవంత్.! ఇది మరీ ఘోరం.!

Revanth : బిగ్ బాస్ రియాల్టీ షోలో, అసహజమైన సంబంధాలు కనిపిస్తుంటాయ్. నిజానికి, అవేవీ అసలు సంబంధాలే కావు. టైమ్ పాస్ వ్యవహారాలు. అన్నా చెల్లెళ్ళుగా చెప్పుకునేటోళ్ళు టాస్క్‌ల సమయంలో ప్రత్యర్థులుగా మారిపోతుంటారు.. రొమాంటిక్ సాంగ్స్‌కి ఇంకా రొమాంటిక్‌గా స్టెప్పులేస్తుంటారు.

Singer Revanth trying to impress Merina in Biggboss

Singer Revanth trying to impress Merina in Biggboss

బిగ్ బాస్ అంటే జస్ట్ యాక్టింగ్.! దాన్ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు. పేరులో ‘రియాల్టీ’ తప్ప, అందులో అస్సలేమాత్రం సహజత్వం కనిపించదు.

మెరీనాని రేవంత్ ఎందుకు గోకుతున్నాడబ్బా.?

హౌస్‌లో మెరీనా – రోహిత్ అనే జంట కూడా వుంది. వీళ్ళిద్దరూ రియల్ లైఫ్‌లో భార్యాభర్తలు.. గతంలో వితిక షెరు – వరుణ్ సందేశ్ వున్నట్లే.. వీళ్ళు కూడా.! అయితే, రోహిత్ నుంచి ముద్దు కోసం ఆరాటపడుతోంది మెరీనా. అదో డ్రామా.!

కాగా, మెరీనాతో ఎక్కువ చనువుగా రేవంత్ వుంటున్నాడనీ, ఇది అస్సలేమాత్రం సబబుగా లేదనీ రేవంత్ మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.. అక్క.. అక్క.. అంటూనే, గోకడం స్టార్ట్ చేశాడన్నది రేవంత్ మీద ప్రధాన ఆరోపణ. ఈ ప్రచారంపై రేవంత్ మద్దతుదారులు మండిపడుతున్నారు.

అయితే, ఈ ప్రచారం రేవంత్‌ని దెబ్బ కొడుతుందనీ, రేవంత్.. మెరీనా సహా ఇతర ఫిమేల్ కంటెస్టెంట్లకు దూరంగా వుండడమే మంచిదనీ అతని అభిమానులు కోరుకుంటున్నారు.