Bigg Boss House : బిగ్ బాస్ హౌస్‌లో బూతుల రేవంత్.! ఎందుకిలా తయారయ్యాడు.?

NQ Staff - November 4, 2022 / 04:45 PM IST

Bigg Boss House : బిగ్ బాస్ హౌస్‌లో బూతుల రేవంత్.! ఎందుకిలా తయారయ్యాడు.?

Bigg Boss House : బిగ్ బాస్ రియాల్టీ షోలో ఏదీ కంటెస్టెంట్లు అనుకుని చేసేది కాదన్న విమర్శ వుంది. అంతా స్క్రిప్టెడ్ వ్యవహారమేనంటూ చాలా ఆరోపణలు వున్నాయి. మరి, రేవంత్ బూతుల సంగతేంటి.? ఆ బూతులు కూడా బిగ్ బాస్ స్క్రిప్టులో భాగమేనా.?

గత సీజన్లలోకి వెళితే రాహుల్, సోహైల్ తదితర కంటెస్టెంట్లు తమ హద్దులు దాటారు. వారిని జస్ట్ వారించడం మినహా బిగ్ బాస్ అయితే సీరియస్ యాక్షన్ తీసుకోలేదు. వాటిని యధాతథంగా ప్రసారం చేస్తున్నారంటేనే అదంతా స్క్రిప్ట్ అని అర్థం.

రేవంత్ మీద ఆ ముద్ర ఎందుకు పడుతోంది.?

‘రేవంత్ కాస్త భాష మీద అదుపు అవసరం..’ అని బిగ్ బాస్ హౌస్‌లో పలువురు కంటెస్టెంట్లు ఏదో ఒక రూపంలో అతన్ని వారిస్తున్నారు. సింగర్‌గా రేవంత్ సుపరిచితుడే. మరీ అంత అగ్రెసివ్ నేచర్ ఏమీ కాదతనిది. కానీ, హౌస్‌లో రేవంత్ చాలా అగ్రెసివ్‌గా కనిపిస్తున్నాడు.

తాజాగా బిగ్ హౌస్‌లో ఓ టాస్క్ సందర్భంగా రేవంత్ నోటి మీద అదుపు కోల్పోయాడు. టైటిల్ ఫేవరెట్‌గా వున్న రేవంత్ మాట్లాడుతున్న బూతులు, ఆయన అభిమానుల్ని కూడా మెప్పించడంలేదు. పైగా, అతన్ని అభిమానులే ఛీత్కరించుకునే పరిస్థితి వస్తోంది.

తాజా ఎపిసోడ్ రేవంత్‌కి చాలా చెడ్డ పేరు తెచ్చింది. ‘నా కొడకా..’ అంటూ విరుచుకుపడిపోయాడు రేవంత్ అలా నోటికొచ్చింది మాట్లాడి ప్రత్యర్థి కంటెస్టెంట్ల మీద పై చేయి సాధించాలనుకుంటున్నాడా.? స్క్రీన్ స్పేస్ కోరుకుంటున్నాడా.? రేవంత్‌కే తెలియాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us