Singer Mangli : సింగర్ మంగ్లీ ఒక్క పాటకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలుసా..?
NQ Staff - January 26, 2023 / 09:50 AM IST

Singer Mangli : సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చిన్న న్యూస్ ఛానెల్ లో కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె ఆ తర్వాత సింగర్ గా మారిపోయింది. న్యూస్ ఛానెల్ లో చేసినప్పటి కంటే కూడా ఆమెకు సింగర్ గానే ఎక్కువ పేరు వచ్చింది. ఒక్కో సినిమాలో పాట పాడుతూ తానేంటో నిరూపించుకుంది. ఆమె గాత్రానికి లక్షలాది మంది అభిమానులు సొంతం అయిపోయారు.
అలా వచ్చిన క్రేజ్ తో ఆమె సినిమాల్లో పాటలు పాడటం స్టార్ట్ చేసింది. సింగర్ మంగ్లీ సినిమాల్లో ఐటెం సాంగ్స్ తో పాటు కొన్ని మెలోడీ సాంగ్స్ కూడా పడటం మొదలు పెట్టింది. దాంతో ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ మధ్య ఆమె పాడిన పాటలు దాదాపు అన్నీ హిట్టే అవుతున్నాయి. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడలో కూడా బాగానే పాటలు పాడింది.
రూ.7లక్షల దాకా..
ఈ క్రమంలోనే ఆమె స్టార్ సింగర్ కావడంతో ఆమె రెమ్యునరేషన్ కూడా అమాంతం పెంచేసిందంట. మొన్నటి వరకు ఆమె పాటకు రూ.5లక్షలు తీసుకునేది. కానీ ఇప్పుడు ఆ సంఖ్యను రూ.7లక్షలకు పెంచేసింది. ఆమెకు సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. దానికి 2మిలియన్ల దాకా సబ్ స్క్రైబర్లు ఉన్నారు.
ఆమె సొంతంగా పాటలు నిర్మించి ఇందులో విడుదల చేస్తోంది. అలాగే ఆమె కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ కు కూడా పాటుల పాడుతోంది. దాని ద్వారా కూడా ఆమెకు బాగానే ఇన్ కమ్ వస్తోంది. ఈ రకంగా ఆమె నాలుగైదు రకాలుగా డబ్బులు సంపాదిస్తోంది.