Singer Mangli : మరో వివాదంలో సింగర్ మంగ్లీ.. ఈసారి ప్రభుత్వం కూడా!
NQ Staff - February 21, 2023 / 06:14 PM IST

Singer Mangli : ప్రముఖ గాయిని మంగ్లీ మరో వివాదంలో చిక్కుకున్నారు. ప్రతి సంవత్సరం ఆమె మహా శివరాత్రి సందర్భంగా ఒక పాటను విడుదల చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కు గాను మంగ్లీ కొత్త పాటను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.
ఆ పాటను ఎక్కువ శాతం శ్రీకాళహస్తి ఆలయంలో చిత్రీకరించడం జరిగింది. నిబంధన ప్రకారం శ్రీకాళహస్తి ఆలయంలోకి కెమెరాలు సెల్ ఫోన్స్ అనుమతించారు. గత కొన్నాళ్లుగా వాటిపై ఆంక్షలు విధించారు. కానీ మంగ్లీ యొక్క పాటకు మాత్రం చిత్రీకరణకు ఎలా అంగీకరించారంటూ సాధారణ జనాలు మరియు సోషల్ మీడియా జనాలు అధికారులను ప్రశ్నిస్తున్నారు.
రాహు కేతు, సర్ప దోష పూజ మండపంలో, కాల భైరవ ఆలయంలో ముందు భాగంలో పాట చిత్రీకరించినట్లు క్లియర్ గా కనిపిస్తోంది. కనుక ఈ విషయమై అధికారులపై చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. సామాన్యులకు ఒక న్యాయం, సెలబ్రిటీలకు ఒక న్యాయమా అంటూ ఈ సందర్భంగా మంగ్లీ పాట పై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ వివాదం నుండి మంగ్లీ ఎలా బయట పడుతుందో చూడాలి. గతంలో కూడా మంగ్లీ పై ఇలాంటి వివాదాలు రాజుకున్నాయి. అయితే ఈసారి ప్రభుత్వం పై కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదంలో ప్రభుత్వ అధికారులు మరియు మంగ్లీ స్పందించాల్సి ఉంది.
ఆలయ ఆవరణలో ఒక్క ఫొటో తీసుకోవాలంటే సామాన్యుడికి సాధ్యం కాదు..
కెమేరా కోసం జేబులు, బ్యాగ్ లు తనిఖీ.
కానీ ఇలా ఏకంగా పాటలే చిత్రీకరించడం అంటే నిజంగా గ్రేట్ నే. దేనికైనా అదృష్టం వుండాలి.https://t.co/kr8dNSzYBY— devipriya (@sairaaj44) February 21, 2023