Singer Harini : రైలు ప‌ట్టాల‌పై సింగ‌ర్ తండ్రి మృతదేహం.. నాలుగు రోజుల్లో ఏం జరిగింది..!

Singer Harini : ప్రముఖ నేపథ్య గాయని హరిణి తండ్రి ఏకే రావు బెంగళూరులోని రైల్వే ట్రాక్‌పై అనుమానస్పద స్థితిలో క‌నిపించారు. ఆయన మృతదేహం లభ్యమయ్యింది. ఈ క్రమంలో బెంగళూరు పోలీసులు దీన్ని హత్య కేసుగా నమోదు చేశారు. సెక్షన్ 302, 201 ప్రకారం కేసు నమోదు చేశారు. ఏకే రావు శరీరం పై కత్తి గాయాలు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.

Singer Harini father dead body on railway track
Singer Harini father dead body on railway track

టాలీవుడ్ సింగర్ ఆయల సోమయాజుల హరిణి ఇంట్లో ఓ మిస్టరీ కనిపిస్తోంది. వారం రోజులుగా ఆ ఫ్యామిలీ మొత్తం మిస్సైపోయింది. ఈ మేరకు అంతా హల్‌చల్ అవుతున్న క్షణంలో ఆమె తండ్రి ఏకే రావు బెంగళూరు సమీపంలోని రైల్వే ట్రాక్‌పై శవంగా కనిపించారు.

ఏకే రావు నవంబర్‌ 8 న హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. చివరిసారిగా ఆయన ఈ నెల 19 న కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిసింది. నాలుగు రోజుల తర్వాత అనగా నవంబర్‌ 23 న ఏకే రావు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు.

ఈ నాలుగు రోజుల్లో ఏం జరిగిందనేది మిస్టరీగా మారింది. ఈ క్రమంలో ఏకే రావుది హత్యే అంటూ ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక బెంగళూరులోనే ఆయన అంత్యక్రియలు పూర్తి చేశారు ఏకే రావు కుటుంబ సభ్యులు. ఆయనది హత్యనా, ఆత్మహత్యనా అన్న కోణంలో బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఏకే రావుది మొదట ఆత్మహత్యగా భావించిన పోలీసులు.. ఆ తర్వాత డెడ్ బాడీపై ఉన్న బలమైన గాయాలు చూశాక అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, ఎవరైనా కొట్టి చంపేశారా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు.ఆయన్ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆర్థిక లావాదేవీలే కారణమా? లేదంటే ఇంకేదైనా కోణముందా? అనే కోణంలో చర్చలు నడుస్తున్నాయి. అసలు హరిణి ఫ్యామిలీ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఎందుకు వెళ్లింది? వారం రోజులుగా అజ్ఞాతంలో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? అనేది జనాల్లో హాట్ టాపిక్ అయింది.