Maharshi: మహర్షి రేంజే వేరు.. ఏకంగా పది నామినేషన్స్‌లో నిలిచి సత్తా చాటింది..!
Samsthi 2210 - August 17, 2021 / 02:59 PM IST

Maharshi: దక్షిణాదిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అతి పెద్ద సినీ పండుగ సైమా. ఈ వేడుక ప్రతి సంవత్సరం ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుంతో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకి హాజరై తెగ సందడి చేస్తుంటారు. అందాల భామలు ఈ వేడుకలో చేసే సందడి ఓ రేంజ్‌లో ఉంటుంది. ముఖ్యంగా గ్లామర్ షోతో అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుంటారు
.
కరోనా వల్ల గత ఏడాది సైమా అవార్డ్ వేడుక నిర్వహించుకోలేకపోయారు. కానీ ఈ సారి సైమా నిర్వహణకు రంగం సిద్దమైంది. అయితే తాజాగా సైమా నామినేషన్లకు సంబంధించిన విషయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. మహేష్ బాబు మహర్షి, ధనుష్ అసురన్ వంటి చిత్రాలు ఏకంగా పది కేటగిరీల్లో నామినేట్ అయ్యాయి. మరి ఇందులో ఎన్ని కేటగిరీలలో ఈ చిత్రం అవార్డ్స్ అందుకుంటుందో చూడాలి.,
2019 సంవత్సరానికి గానూ వివిధ కేటగిరీలలో నామినేట్ అయిన మోస్ట్ పాపులర్ సినిమాల జాబితాను ప్రకటించారు. ఇందులో ‘మహర్షి’ (తెలుగు) – ‘అసురన్’ (తమిళం) – ‘యజమానా’ (కన్నడ) – ‘కుంబలంగి నైట్స్’ (మలయాళం) చిత్రాలు SIIMA నామినేషన్ లలో ముందున్నాయి. మహర్షి చిత్రానికి ధీటుగా పలు చిత్రాలు బరిలో ఉన్నా కూడా, ఈ మూవీ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
‘మహర్షి’ మూవీ 10 విభాగాల్లో నామినేట్ అయింది. బెస్ట్ ఫిలిం – బెస్ట్ డైరెక్టర్ – బెస్ట్ యాక్టర్ – బెస్ట్ యాక్ట్రెస్ – బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ – బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ – బెస్ట్ లిరిసిస్ట్ – బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (మేల్) – బెస్ట్ విలన్ – బెస్ట్ సినిమాటోగ్రాఫర్ కేటగిరీలలో మహర్షి నిలవగా, నాగచైతన్య – సమంత హీరోహీరోయిన్లుగా శివ నిర్వాణ తెరకెక్కించిన ”మజిలీ” మూవీ 9 విభాగాల్లో నామినేషన్ పొందింది. ఇక నాని – గౌతమ్ తిన్నూరి ల ”జెర్సీ” సినిమా 7 కేటగిరీలలో నామినేట్ అయింది.
ధనుష్ అసురన్ సైతం దుమ్ములేపుతోంది. నామినేషన్స్ విషయంలో అసురన్ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటి, ఉత్తమ పాటల రచయిత, ఉత్తమ నేపథ్య గాయని, ఉత్తమ నేపథ్య గాయకుడు ఇలా మొత్తంగా పది కేటగిరిల్లో అసురన్ సత్తా చాటబోతోంది. మలయాళంలో ఫహద్ ఫాజిల్ నటించిన ‘కుంబళంగి నైట్స్’ ఏకంగా 13 కేటగిరీలలో నామినేట్ అవడం గమనార్హం. కన్నడ ‘యజమాన’ సినిమా 12 నామినేషన్లు పొందింది.