SIIMA Awards: ‘సైమా’ అవార్డుల విషయంలో ఎందుకీ లొల్లి.?

NQ Staff - September 11, 2022 / 02:51 PM IST

157882SIIMA Awards: ‘సైమా’ అవార్డుల విషయంలో ఎందుకీ లొల్లి.?

SIIMA Awards : సైమా అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ‘తగ్గేదే లే’ అంటూ ‘పుష్ప’ సినిమా పలు కేటగిరీల్లో అవార్డులు దక్కించుకుంది. తెలుగు సహా వివిధ సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులకు వివిధ విభాగాల్లో కేటగిరీల్లో పురస్కారాలు దక్కాయి.

ప్రతిసారిలాగానే, ఈసారి కూడా సైమా అవార్డుల విషయంలో సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చే జరుగుతోంది. ఏయే స్టార్లు తమ అవార్డుల ఈవెంట్‌కి హాజరవుతారు.? అన్న కోణంలోనే అవార్డుల్ని ప్రకటిస్తుంటారన్నది ప్రధానంగా ‘సైమా’ మీద వినిపించే విమర్శ.!

వెళ్తామంటేనే అవార్డులిస్తారు..

Saima Awards Will Discussed On Social Media

SIIMA Awards Will Discussed On Social Media

ఏ హీరోకి అయితే, అవార్డుల ఈవెంట్‌కి హాజరయ్యేంత తీరిక వుంటుందో.. వాళ్ళకి మాత్రమే అవార్డులు వస్తుంటాయనేది ‘సైమా’ విషయంలోనే కాదు, ‘ఫిలింఫేర్’ విషయంలోనూ జరుగుతుంటుంది. నిజానికి, చాలా అవార్డులకు సంబంధించి ఇలాంటి వాదనలు బలంగా వినిపిస్తుంటాయి.

‘సైమా’ విషయంలోనూ అదే జరిగిందా.? అంటే, తెలుగు సినీ పరిశ్రమలోనే కాదు, ఇతర సినీ పరిశ్రమల్లోనూ ఇలాగే చర్చించుకుంటున్నారు. ఈ మాత్రం దానికి అవార్డులు వచ్చాయని ఘనంగా చెప్పుకోవడమెందుకు.? అంటే, అవార్డులు సినీ జనాలకి కొత్త ఉత్సాహాన్నిస్తాయి మరి.!