Shyam : అల్లు అర్జున్‌ కంటే ఆయనే బెస్ట్‌ డాన్సర్‌

NQ Staff - November 25, 2022 / 01:55 PM IST

Shyam : అల్లు అర్జున్‌ కంటే ఆయనే బెస్ట్‌ డాన్సర్‌

Shyam : ఐకానిక్ స్టార్  అల్లు అర్జున్  డాన్స్ కి కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి ఫాలోవర్స్ ఉన్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ డాన్స్ కోసం ఎంతో కష్టపడతాడు అనేది కూడా అందరికీ తెలిసిందే.

ఆయన డాన్స్ విషయంలో అస్సలు లైట్ తీసుకోడు. యాక్షన్స్ సన్నివేషాల కంటే కూడా ఎక్కువ ప్రాముఖ్యతను డాన్స్ కి అల్లు అర్జున్ ఇస్తాడు. అలాంటి అల్లు అర్జున్ డాన్స్ విషయం లో రేసుగుర్రం విలన్ శ్యామ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

డాన్స్ విషయంలో తమిళ సూపర్ స్టార్ విజయ్ మరియు అల్లు అర్జున్ ల మధ్య కంపేర్ చేస్తే ఎవరు బెస్ట్ డాన్సర్ అంటూ యాంకర్ ఒక ఇంటర్వ్యూలో అడిగిన సందర్భంలో శ్యామ్ మాట్లాడుతూ కచ్చితంగా విజయ్ ది బెస్ట్ డాన్సర్ అంటూ చెప్పుకొచ్చాడు.

ఆ విషయాన్ని అల్లు అర్జున్ కూడా ఒప్పుకుంటాడు, విజయ్ డాన్స్ చాలా సింపుల్ గా నాచురల్ గా ఉంటుందని పేర్కొన్నాడు. ఇక అల్లు అర్జున్ డాన్స్ ప్రాక్టీస్ కోసం ఎంతో కష్టపడతాడు. ఒక పాట చిత్రీకరణ కోసం మూడు నాలుగు నెలల ముందు నుండే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడని శ్యామ్ పేర్కొన్నాడు.

రేసుగుర్రం సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో పదే పదే తాను చేయబోతున్న పాటలకు సంబంధించిన డ్యాన్స్ మూమెంట్స్ ని చూపించేవాడని శ్యామ్ పేర్కొన్నాడు.

అల్లు అర్జున్ కంటే విజయ్ బెస్ట్ డాన్సర్ అంటూ శ్యామ్‌ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాస్త సీరియస్ గానే ఈ విషయంలో శ్యామ్‌ పై కామెంట్స్ చేస్తున్నారు.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us