Shruti Haasan : షాకింగ్.! మిడిల్ ఫింగర్ చూపించిన హీరోయిన్ శృతిహాసన్.!
NQ Staff - December 15, 2022 / 11:00 AM IST

Shruti Haasan : అనూహ్యంగా మళ్ళీ రేసులోకి దూసుకొచ్చింది హీరోయిన్ శృతిహాసన్. బ్యాక్ టు బ్యాక్ రెండు ప్రెస్టీజియస్ మూవీస్‌లో శృతిహాసన్ నటిస్తోంది. ఆ రెండూ వచ్చే సంక్రాంతికి విడుదలవుతున్నాయి. ఈ సినిమాలు సూపర్ హిట్స్ అయితే, నెంబర్ వన్ హీరోయిన్.. అనే ట్యాగ్ శృతిహాసన్‌కి దక్కినా ఆశ్చర్యపోవాల్సిన పనేమీలేదు.

Shruti Haasan Posed For Photos Showing Her Middle Finger
నందమూరి బాలకృష్ణతో ‘వీర సింహారెడ్డి’, మెగాస్టార్ చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాల్లో శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Shruti Haasan Posed For Photos Showing Her Middle Finger
మిడిల్ ఫింగర్ ఎందుకు చూపించిందబ్బా.?
ఈ మధ్య ‘మిడిల్ ఫింగర్’ వ్యవహారం పెద్ద రచ్చకు తావిస్తోంది. సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే, ఏపీ మంత్రి రోజా ఎయిర్ పోర్టులో జనసేన కార్యకర్తల్ని ఉద్దేశించి మిడిల్ ఫింగర్ చూపారన్న విమర్శలొచ్చాయి. ఆ కారణంగా ఆమెపై దాడికి యత్నం జరిగినట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

Shruti Haasan Posed For Photos Showing Her Middle Finger
మరి, శృతిహాసన్ ఎందుకు మిడిల్ ఫింగర్ చూపించినట్లు.? సోషల్ మీడియాలో శృతిహాసన్ పోస్ట్ చేసిన తాజా ఫొటోల్లో ఒకటి మిడిల్ ఫింగర్ చూపిస్తూ వుంది. ఇదొక అసభ్యకరమైన వ్యవహారానికి సంకేతం. వెస్ట్రన్ కల్చర్.. దీన్ని ఈ మధ్య ఇండియా లోనూ ఎక్కువగానే వాడేస్తున్నారు.
అయినా, అన్నింటికి పెడార్ధాలు తీయడమేనా.? వేలికి వున్న ఉంగరం చూపే ప్రయత్నం శృతిహాసన్ చేసి వుండొచ్చు కదా.?