Shruti Haasan : మద్యం తాగడం మానేశా.. డ్రగ్స్ కూడా అంటూ శృతిహాసన్ బోల్డ్ ఆన్సర్..!
NQ Staff - June 23, 2023 / 11:58 AM IST

Shruti Haasan : సినిమా రంగం అంటేనే ఫ్రీడమ్ కు పెట్టింది పేరు. ఇక్కడ పని చేసే హీరోలు, హీరోయిన్లు చాలా ఎంజాయ్ చేస్తుంటారు. ఇక హీరోయిన్లు కూడా మద్యం తాగడం, డ్రగ్స్ తీసుకోవడం లాంటి ఆరోపణలు కూడా ఎదుర్కుంటారు. గతంలో చాలామంది హీరోయిన్లు పీకల దాకా మద్యం తాగి మీడియాకు చిక్కిన ఘటనలు కూడా ఉన్నాయి.
కాగా ఇప్పుడు శృతిహాసన్ వంతు వచ్చింది. ఆమె మొన్నటి వరకు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. కానీ ఇప్పుడు బాలీవుడ్ కు వెళ్లిపోయింది ఈ భామ. ప్రస్తుతం అక్కడే వరుసగా సినిమాల్లో నటిస్తోంది. ఇక మొన్న సౌత్ లోని సీనియర్ హీరోల సరసన కూడా నటించింది ఈ భామ.
ఇదిలా ఉండగా ఆమె ఇప్పుడు శాంతాను హజారికతో డేటింగ్ లో ఉంది. ఇద్దరూ ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారు. అయితే శృతి అప్పుడప్పుడు తన ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తుంది. తాజాగా ఆమె చిట్ చాట్ చేస్తుండగా ఓ నెటిజన్ షాకింగ్ ప్రశ్న వేశాడు. నువ్వు మద్యం తాగుతావా అని అడిగాడు.
నేను మద్యం ఒకప్పుడు తాగాను. కానీ ఇప్పుడు తాగట్లేదు. ఆ అలవాటే మానేశాను. డ్రగ్స్ కూడా ఎప్పుడూ తీసుకోలేదు. ప్రస్తుతం ఉన్నతమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను అంటూ రిప్లై ఇచ్చింది ఈ భామ. ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.