Shri Reddy : వాడికి నా శాపమే తగిలింది.. అహింస ప్లాప్ పై స్పందించిన శ్రీరెడ్డి..!
NQ Staff - June 4, 2023 / 10:10 AM IST
Shri Reddy : సౌత్ ఇండియాలో కాంట్రవర్సీలకు పెట్టింది పేరు శ్రీరెడ్డి. ఆమె చేసే కామెంట్లు ఎంత దారుణంగా ఉంటాయో అందరికీ తెలిసిందే. మీటూ ఉద్యమ సమయంలో ఆమెకు చాలా క్రేజ్ ఏర్పడింది. కానీ దాన్ని ఆమె కాపాడుకోలేకపోయింది. స్టార్ హీరోలను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడంతో ఆమెను ఇండస్ట్రీ బ్యాన్ చేసేసింది. ఇప్పుడు కేవలం యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ వస్తోంది.
అయితే మీటూ ఉద్యమ సమయంలో ఆమె దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ మీద సంచలన ఆరోపణలు చేసింది. ఛాన్సుల పేరుతో తనను వాడుకున్నాడని, ముద్దులు పెట్టుకునే ఫొటోలు కూడా రివీల్ చేసింది. దాంతో ఆయన మీద నెగెటివిటీ ఏర్పడింది. చాలా కాలం గ్యాప్ తీసుకుని ఆయన తేజ దర్శకత్వంలో చేసిన అహింస మూవీ అట్టర్ ప్లాప్ అయింది.
ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి అందరి కన్ను శ్రీరెడ్డి మీద ఉంది. ఆమె ఈ మూవీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుందేమో అని అంతా అనుకున్నారు. కానీ ఆమె పెద్దగా స్పందించలేదు. కానీ మూవీ ప్లాప్ అయిన తర్వాత ఆమె ఓ షార్ట్ వీడియో రిలీజ్ చేసింది. ఇందులో అహింస పేరు గానీ, అభిరామ్ పేరు గానీ తీయలేదు.
కానీ ఆమె మాట్లాడుతూ.. ఖర్మ అనేది ఉంటుంది. మనం చేసే పాపాలను ఆ దేవుడు చూస్తాడు. వాడికి నా శాపమే తగిలింది. అందుకే ఇలా జరిగింది. ఇక ముందు కూడా బాగా అనుభవిస్తాడు థాంక్యూ గాడ్ అంటూ వీడియోను ముగించింది ఈ భామ. ఆమె చేసిన కామెంట్లు ఇన్ డైరెక్టుగా అభిరామ్ మూవీ అహింసను ఉద్దేశించే అన్నట్టు ఉన్నాయి.