Shraddha Kapoor : చీర‌క‌ట్టులో సెగ‌లు రేపుతున్న సాహో బ్యూటీ

Shraddha Kapoor : బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ‌లు గ్లామ‌ర్‌షో తో అద‌రగొడుతున్నారు. ప్రభాస్ హీరోయిన్‌, `సాహో` భామ శ్రద్ధా కపూర్ బాలీవుడ్‌లో ఓ సంచలన హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. రెండేళ్ల వరకు సెన్సేషనల్‌గా బ్యూటీగా నిలిచిన ఈ భామ ఇప్పుడు క్రేజ్‌ తగ్గింది.తండ్రి శక్తి కపూర్ బాలీవుడ్‌లో విలన్‌గా కమెడియన్‌గా అదరగొడితే.. శ్రధ్దా కపూర్ కథానాయికగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Shraddha Kapoor Saree photo shoot
Shraddha Kapoor Saree photo shoot

ఇటీవ‌లి కాలంలో శ్ర‌ద్ధా క‌పూర్ త‌న గ్లామ‌ర్ షోతో మ‌తులు పోగొడుతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చీర క‌ట్టులో క్యూట్ లుక్ లో క‌నిపిస్తూ మ‌తులు పోగొడుతుంది. శ్ర‌ద్దా క్యూట్ లుక్స్ చూసి అంద‌రు మైమ‌ర‌చిపోతున్నారు.శ్ర‌ద్ధా గ్లామ‌ర్ ఫొటోలు చూసి అంద‌రు మైమ‌ర‌చిపోతున్నారు.

Shraddha Kapoor Saree photo shoot
Shraddha Kapoor Saree photo shoot

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు శక్తి కపూర్‌ తనయగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన శ్రద్ధా కపూర్‌ ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని, స్టార్‌ ఇమేజ్‌ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా `ఆషిఖి2` చిత్రంతో ఓవర్‌ నైట్‌లో స్టార్‌ అయిపోయింది శ్రద్ధా. ఈ రొమాంటికల్‌ మ్యూజికల్‌ డ్రామాలో శ్రద్ధా లవర్‌గా అద్భుతమైన నటనతో మెస్మరైజ్‌ చేసింది. ఘాటైన అందాలతో పిచ్చెక్కించింది. ఈ ఒక్క సినిమాతోనే బాలీవుడ్‌ యూత్‌ని తనవైపు తిప్పుకుంది శ్రద్ధా.

`ఏక్‌ విలన్‌`, `హైదర్‌`, `ఏబీసీడీ2` చిత్రాలతో శ్రద్ధా కపూర్‌ రేంజే మారిపోయింది. స్టార్‌ హీరోయిన్‌ అనే ట్యాగ్‌ని తగిలించుకుంది. బాలీవుడ్‌లో క్రేజీ బ్యూటీగా మారిపోయింది. మ‌రోవైపు `బాఘి` చిత్రంలో టైగర్‌ ష్రాఫ్‌తో జోడి కట్టి రియల్‌ లైఫ్‌లోనూ లవర్స్ గా మారిపోయారనే టాక్‌ వినిపించింది. కానీ అది నిజం కాదనే విషయాన్ని దిశా పటానీ ఎంట్రీతో క్లారిటీ వచ్చేసింది.

కమర్షియల్‌ హీరోగానే కాకుండా కథా బలమున్న సినిమాల్లోనూ భాగమవుతూ నటిగా తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది శ్రద్ధాకపూర్‌. అందుకు `హసీనా పార్కర్‌`, `స్త్రీ` చిత్రాలు ఉదాహరణగా నిలిచాయి. ఇటీవల `చిచ్చోర్‌`, `స్ట్రీట్‌ డాన్సర్‌ 3డీ`, `బాఘి3` చిత్రాల్లో నటించి విజయాలను అందుకుంది. కానీ నెక్ట్స్ సినిమాల విషయంలో గ్యాప్‌ ఇచ్చింది శ్రద్ధా. ప్రస్తుతం ఆమె కేవలం లవ్‌ రంజన్‌ చిత్రంలో నటిస్తుంది.