Guntur Kaaram Shooting Update : గుంటూరు కారం సినిమాలోకి ఎవరూ ఊహించిన హీరోయిన్.. ఎవరామె..?

NQ Staff - June 24, 2023 / 10:52 AM IST

Guntur Kaaram Shooting Update : గుంటూరు కారం సినిమాలోకి ఎవరూ ఊహించిన హీరోయిన్.. ఎవరామె..?

Guntur Kaaram Shooting Update : మహేశ్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాకు వరుసగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పలుసార్లు వాయిదా పడింది. అనుకున్న సమయం కంటే ఆసల్యం అవుతోంది. షూటింగ్ నడుస్తున్న సమయంలోనే మహేశ్ తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. అలా కొంత కాలం విరామం వచ్చింది.

ఆ తర్వాత మెల్లిమెల్లిగా షూటింగ్ జరుగుతున్న సమయంలో.. ఏదో ఒక అవాంతరం వస్తోంది. ఈ మూవీ షూటింగ్ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో పూజాహెగ్డే కూడా ఇందులో నుంచి తప్పుకుంది. ఇప్పటికే ఈ విషయం మీద ఆమె టీమ్ క్లారిటీ ఇచ్చింది. పూజాహెగ్డే తప్పుకోవడంతో శ్రీలీల పంట పండింది.

అప్పటి వరకు ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా తీసుకున్న శ్రీలీలను ఇప్పుడు మెయిన్ హీరోయిన్ గా తీసుకుంటున్నారు. ఇక సెకండ్ హీరోయిన్ గా ఎవరూ ఊహించిన భామను తీసుకువచ్చాడు త్రివిక్రమ్. ఆమె ఎవరో కాదు మీనాక్షి చౌదరి. ఖిలాడి, హిట్-2 సినిమాలో ఆమె ఆకట్టుకుంది.

 Shooting Of Guntur Karam Movie Postponed Several Times

Shooting Of Guntur Karam Movie Postponed Several Times

మమేశ్ బాబు అందం, హైట్ కు తగ్గ పర్సనాలిటీ అని త్రివిక్రమ్ భావిస్తున్నారు. పైగా ఫ్రెష్ హీరోయిన్ గా బాగుంటుందని భావిస్తున్నారు మూవీ టీమ్. ఇలా మీనాక్షి పంట పండినట్టు అయిపోయింది. ఈ సినిమా శ్రీలీలకే బాగా ప్లస్ అవుతుందని అంతా భావిస్తున్నారు. చూడాలి మరి త్రివిక్రమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us