SSMB 28 Movie : మహేష్‌బాబు సినిమాకి 2 కోట్లు నష్టం.! పాత స్క్రిప్ట్ ఔట్, కొత్త స్క్రిప్ట్.?
NQ Staff - November 25, 2022 / 01:27 PM IST

SSMB 28 Movie : సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కొన్ని రోజులపాటు జరిగిన తర్వాత, అనూహ్యంగా షూటింగుకి బ్రేక్ వచ్చింది.
ఇటీవల మహేష్ తండ్రి కృష్ణ మృతి చెందడంతో, గ్యాప్ మరింత పెరిగింది. ఈలోగా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. స్క్రిప్ట్ విషయంలో మొదటి నుంచీ కొంత గందరగోళం వుందనీ, ఈ కారణంగానే ఈ గ్యాప్ ఇంకాస్త పెరిగిందనీ అంటున్నారు.
పాత స్క్రిప్టు పక్కన పడేశారా.?
2 కోట్లకుపైగానే ఖర్చు చేశాక, ఇప్పటికే చిత్రీకరించిన పార్టుని డంప్ చేయాలనే నిర్ణయానికి వచ్చారట మేకర్స్. నిజానికి, మహేష్ అసంతృప్తి వల్లనే ఇదంతా జరుగుతోందని సమాచారం.
కొత్త స్క్రిప్టుతో డిసెంబర్ నెలలో మళ్ళీ సినిమా షూటింగ్ కొత్తగా ప్రారంభం కాబోతోందట. చిత్రీకరించిన పార్ట్ విషయానికొస్తే, అదొక యాక్షన్ సీక్వెన్స్. ‘కేజీఎఫ్’కి స్టంట్ కొరియోగ్రఫీ చేసినవాళ్ళతో ఆ యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేయించారు.
ఈ సినిమా కోసం పూజా హెగ్దేని హీరోయిన్‌గా తీసుకున్న సంగతి తెలిసిందే. ఇంకా ఆమె షూటింగులో జాయిన్ కాలేదు. ఇంతకీ కొత్త స్క్రిప్టు సిద్ధమయినట్లేనా.?