Student : తన కొడుకే ఫస్ట్ రావాలని వేరే విద్యార్థికి విషం ఇచ్చి చంపేసింది

NQ Staff - September 4, 2022 / 11:02 AM IST

156612Student : తన కొడుకే ఫస్ట్ రావాలని వేరే విద్యార్థికి విషం ఇచ్చి చంపేసింది

Student : ప్రతీ తల్లికి తన బిడ్డ మీద ప్రేముంటుంది. ప్రాణాలు పణంగా పెట్టయినా వాళ్లకి అపాయం రాకుండా కాపాడుకోవాలనుకుంటుంది. రెక్కలు ముక్కలు చేసుకునయినా పిల్లలని ఆనందంగా చూడాలనుకుంటుంది. కానీ కొడుకు మీద విపరీతమైన ప్రేమతో ఓ దారుణానికి తెగబడిందో తల్లి.

She killed another student by giving poison to her son to get first

She killed another student by giving poison to her son to get first

తన కొడుకే స్కూల్ లో ఫస్ట్ రావాలని చదువులో పోటీ ఇస్తున్న మరో విద్యార్థికి కూల్ డ్రింక్ లో విషం కలిపిచ్చింది. పుదుచ్చేరి కారైక్కాల్ లోని ఓ ప్రైవేట్ స్కూల్లో జరిగిన ఘటనిది. ఎనిమిదవ తరగతి చదువుతున్న మణికందన్ అనే అబ్బాయికి స్కూల్ వాచ్ మెన్ ద్వారా కూల్ డ్రింక్ లో విషం కలిపిచ్చింది సదరు తల్లి. పరిస్థితి విషమించడంతో ఆ బాలుడిని హుటాహుటిన హాస్పిటల్‌ కి తరలించారు.

కేసు దర్యాప్తు చేసిన పోలీసులు విచారణ చేపట్టి, సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితురాలు సహాయరాణి విక్టోరియాను అరెస్ట్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు మణికందన్ మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు.

సోషల్మీడియాలో ఈ వార్త వైరల్ కావడంతో ఒక్కొక్కరూ ఒక్కోలా రియాక్టవుతున్నారు. తన కొడుకు ఫస్ట్ రావాలనుకోవడంలో ఏ తప్పూ లేదు. కానీ.. ఓ తల్లయ్యుండి ఇంకొకరి బిడ్డని బలితీసుకోవడం ఎంతవరకూ సమంజసం? అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఏ పాపం ఎరుగని ఆ బాలున్ని ఎలా పొట్టనపెట్టుకోబుద్ధయిందంటూ ఘాటుగానే మాటలంటున్నారు ఇంకొందరు. ఇలాంటి వాళ్లు తల్లి అనే పదానికే మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.