Chiranjeevi And Sharwanand : చిరంజీవిపై వీరాభిమానం.! ‘స్వయంకృషి’తోనేనన్న శర్వానంద్.!
NQ Staff - September 7, 2022 / 06:00 PM IST

Chiranjeevi And Sharwanand : మెగాస్టార్ చిరంజీవికి సినీ పరిశ్రమలోనే ఎంతోమంది వీరాభిమానులున్నారు. నటీనటులు, దర్శకులు, నిర్మాతలు.. ఇలా చెప్పుకుంటూ పోతే, చిరంజీవిపై ఎవరికి అభిమానం వుండదు.? ‘మేం చిరంజీవికి వీరాభిమానులం..’ అని చాలామంది చెప్పుకుంటుంటారు. అలా చెప్పుకోవడాన్ని గర్వంగా ఫీలవుతుంటారు కూడా.!
ఇక, యంగ్ హీరో శర్వానంద్ అయితే, మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో మనిషి.! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి అత్యంత సన్నిహితుడు. ‘శర్వానంద్ కూడా నా బిడ్డ చరణ్ లాంటోడే..’ అని పలు సందర్భాల్లో చిరంజీవి చెప్పారు.
చిరంజీవితో ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’లో నటించి..

Sharwanand Took Megastar Chiranjeevi As Inspiration
మెగాస్టార్ చిరంజీవితో ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ సినిమాలో శర్వానంద్ నటించిన సంగతి తెలిసిందే. తన తాజా చిత్రం ‘ఒకే ఒక జీవితం’ సినిమా ప్రమోషన్లలో భాగంగా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఓ ఇంటర్వ్యూ చేశాడు హీరో శర్వానంద్‌తో.
ఈ ఇంటర్వ్యూలో తనకు సినీ రంగంలో ఇన్‌స్పిరేషన్ అంటే చిరంజీవేననీ, చిన్నప్పటినుంచీ చిరంజీవికి వీరాభిమానిననీ, ‘స్వయంకృషి’ సినిమా చూసి, చాలా ఇన్‌స్పయిర్ అయ్యాననీ శర్వానంద్ చెప్పాడు. మనం కూడా కష్టపడితే స్వయంకృషితో ఎదగొచ్చని అప్పట్లో అనుకున్నాననీ, అదే నిజమైందనీ.. శర్వానంద్ చెప్పుకొచ్చాడు.