Sharwanand : శర్వానంద్ స్పెషల్ ‘మెగా’ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.!
NQ Staff - January 1, 2023 / 12:39 PM IST

Sharwanand : యంగ్ హీరో శర్వానంద్, మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితుడని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి వున్న అతి కొద్ది మంది స్పెషల్ ఫ్రెండ్స్‌లో శర్వానంద్ కూడా ఒకడు.
తాజాగా, శర్వానంద్ ఓ ఇంట్రెస్టింగ్ పొటోని రివీల్ చేశాడు. ఆ ఫొటోలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కనిపిస్తున్నారు.
మెగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్..

Sharwanand Revealed An Interesting Photo
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ చెరోవైపు.. మధ్యలో శర్వానంద్.. వెరసి, ఈ ఫొటో అటు మెగాభిమానుల్నీ, ఇటు శర్వానంద్ అభిమానుల్నీ ఆనందంలో ముంచెత్తుతోంది.
మెగా కుటుంబంతో తనకున్న సన్నిహిత సంబంధాల్ని శర్వానంద్ ఈ ఫొటోతో ఇంకోసారి బయటపెట్టినట్లయ్యింది. ఇక, చరణ్ బెస్ట్ ఫ్రెండ్స్ లిస్టులో ముందు వరుసలో శర్వానంద్ వుంటాడు. ఆ తర్వాతి స్థానం రానా దగ్గుబాటిదే. అన్నట్టు, ప్రభాస్‌తోనూ చరణ్‌కి మంచి స్నేహం వుంది.. ‘అరేయ్’ అనేంత స్నేహం వుంది ప్రభాస్‌తో చరణ్‌కి. ఎన్టీయార్ – చరణ్‌ల మధ్య స్నేహం సంగతి సరే సరి.!
Happiest Day 😍
Happy New Year guys 🤗
Love and Light to all of us ❤️ pic.twitter.com/jidHt7qTaD— Sharwanand (@ImSharwanand) December 31, 2022